ప్రపంచాన్ని వణికించబోతున్న మరో మహాయుద్ధం?

అగ్రరాజ్యం అమెరికా, చైనా ల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కొంతకాలం కొనసాగితే భవిష్యత్తుల్లో ప్రచ్ఛన్న యద్ధం సంభవించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. అది రెండు దేశాలతో పాటు ప్రపంచ  దేశాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే అలాంటి పరిస్థితులను నివారించడానికి రెండు అతిపెద్ద శక్తిమంతమైన దేశాలు తమ సంబంధాలు చక్కబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.


ప్రపంచంలో పెద్ద ఆర్థిక శక్తులగా ఉన్న రెండు దేశాలు వాతావరణ మార్పులు, వాణిజ్యం సాంకేతికతలే కాకుండా మానవ హక్కులు, ఆర్థిక వ్యవస్థ ఆన్ లైన్ భద్రత, దక్షిణ చైనా సముద్ర సార్వభౌమాదికారం విషయంలో ఇరు దేశాలు సహకారం అందిపుచ్చుకోవాలని కానీ దురదృష్టశాత్తూ ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఘర్షణ వాతావరణం నెలకొంది.


ఇరు దేశాలు మధ్య వాణిజ్యం సంబంధాలు దెబ్బతినడం, ఆర్థిక నిబంధనలు, పోటాపోటీ మిలటరీ వ్యూహాలను చూస్తే రానున్న రోజుల్లో ప్రపంచం రెండుగా విడిపోయే ముప్పు ఉందని ఐరాస చీఫ్ రెండేళ్ల క్రితమే హెచ్చరించారు. ఒకవేళ ప్రచ్ఛన్న యుద్ధమే సంభవిస్తే ఏడు ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఐఎమ్ఎఫ్ నివేదిక వెల్లడించింది. దీనికి చైనా అమెరికా సంబంధాలు ఒక కారణం కాగా రెండోది డ్రాగన్ కంట్రీలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. అక్కడ ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోతుంది.


మరోవైపు మిగతా దేశాల నుంచి ముఖ్యంగా జపాన్ , తైవాన్ నుంచి జరిగే ఎగుమతులు స్తంభించిపోతున్నాయి. చైనీయుల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఈ ప్రభావం దిగుమతులపై పడుతోంది. దీంతో చైనా నుంచి పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకొని వియత్నాం, ఇండియా వైపు వస్తున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాల క్రమక్రమంగా ప్రపంచ దేశాలకు పాకుతున్నాయి. దీంతో ప్రపంచం సంక్షోభంలో పడే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: