ఉత్తరాది వాళ్లు లేకుండా దక్షిణాది వాళ్లు బతకలేరు?
ఎక్కడికెక్కడో నుంఓ వచ్చే హిందీ వారు తమిళనాడుకు వచ్చి ఇక్కడ నిర్మాణ పనులు చేస్తుంటారు. లేకపోతే మరుగుదొడ్లు కడుగుతుంటారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మరోవైపు ఇంగ్లీషు నేర్చుకొని విద్యావంతులు అయిన వారు ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. కేవలం హిందీ ఒక్కటే తెలిసిన వారు దిక్కుమాలిన ఉద్యోగాలు చేస్తున్నరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దయానిధి మారన్ వ్యాఖ్యలపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ గట్టిగానే బదులిచ్చారు. యూపీ, బిహార్ గురించి ఎవరైనా నోరు పారేసుకుంటే దాన్ని కచ్ఛితంగా ఖండిస్తామని పేర్కొన్నారు. యూపీ, బిహార్ లకు చెందిన కూలీలకు దేశమంతటా డిమాండ్ ఉంది. వారు వేరే ప్రాంతాలకు వెళ్లడం మానేస్తే రాష్ట్రాలు పనిచేయడం మానేసి, స్తంభించిపోతాయని తేజస్వీ ధీటుగానే బదులిచ్చారు.
వాస్తవానికి దక్షిణ భారతదేశంలో పనిచేసే వారిలో బిహార్, ఉత్తర్ ప్రదేశ్ ల నుంచి వచ్చే వలస కూలీలే ఎక్కువ. కటింగ్ షాపుల దగ్గర నుంచి.. భవన నిర్మాణ రంగ సంస్థలు, కంపెనీలో చివరకు నాటు వేసే పనితో సహా అన్ని రంగాల్లో వారే ఉన్నారు. మన దగ్గర స్థానికంగా పనిచేసే కూలీలు వారి పిల్లల్ని చదివించుకొని కొద్దో గొప్పో ఉద్యోగంలో చేర్పిస్తున్నారు. ఫలితం కూలీల కొరత ఏర్పడుతోంది. పైగా డబ్బులు కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వ్యాపారస్థులు, కంపెనీ యజమానులు ఎక్కువగా యూపీ, బిహార్ వాళ్లపైనే ఆధారపడి ఉన్నారు. వీరు పనిచేయడం మానేస్తే తేజస్వీ యాదవ్ అన్నట్లు దక్షిణ భారత దేశం స్తంభించిపోతుంది.