జగన్‌ వస్తే నాశనమే.. బాబు పక్కా స్కెచ్?

సోషల్ మీడియా ప్రస్తుతం ఒక బలమైన మీడియా. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ప్రింట్ మీడియా, ఎలక్ర్టానిక్ మీడియా కన్నా సోషల్ మీడియా పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు, నేతలపై దుష్ప్రచారం చేయాలన్నా అబద్దాన్ని నిజంగా ప్రచారం చేయాలన్నా నిజాన్ని అబద్ధంగా చూపించాలన్నా.. సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. ఒక్క పోస్టు షేర్ చేసి వేల మందికి పంపిచే అవకాశం సోషల్ మీడియాకు ఉండటంతో పార్టీలన్నీ ఈ వింగ్ ను బలోపేతం చేసుకుంటున్నాయి.


అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా బాగా పనిచేసిందనే ప్రచారం జరిగింది. అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించి గులాబీ బాస్ ప్రచారాన్ని  ప్రారంభించినా కాంగ్రెస్ సోషల్ మీడియానే నమ్ముకుంది.  ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీ బాగా కల్పించుకుంది. మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో సోషల్ మీడియాను హోరెత్తించింది. ఈ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కన్నా వెనుకబడే ఉంది.  ఫలితం ఓటమి పాలైంది.


దీని వెనుక ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు హస్తం ఉందనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఏపీపై పడింది. అక్కడ కూడా అన్ని పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఇలాంటి విషయాల్లో చాలా ముందుంటారు. ఈయనకి ప్రస్తుతం సునీల్ కనుగోలు సాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార వైసీపీని బద్నాం చేయడానికి తన శాయశక్తులు ఉపయోగిస్తున్నారు.


గతంలో 2014 సమయంలో జాబు కావాలంటే బాబు రావాలి వంటి నినాదంతో ఎన్నికలకు వెళ్లి విజయవంతం అయ్యారు. ఇప్పుడు కూడా అదే తరహా వ్యూహాలకు టీడీపీ అధినేత సిద్ధం అవుతున్నారు. అందుకు అనుగుణంగా తన సోషల్ మీడియా విభాగాన్ని సిద్ధం చేస్తున్నారు. జగన్ ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది. బాబు వస్తేనే రాష్ట్రం మారిపోతుంది వంటి మౌత్ పబ్లిసిటీతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. జనం ఎక్కడ మాట్లాడుతున్నా వినిపించేలా ఒక నినాదాన్ని ఎంచుకోబోతున్నారు.  పక్కా స్కెచ్ తో యుద్ధ ప్రాతిపాదికన ఒక నినాదాన్ని జనాల్లోకి పంపించేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: