టీడీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయా?
అంతేకాకుండా వీళ్లు ఒక పార్టీ వాళ్ల రహస్యాలు ఇంకొకరు బయట పెట్టుకుంటూ ఉంటారు. తాజాగా సాక్షి కర్నూలు నేతల్లో బాబు కల్లోలం అంటూ ఒక వార్త వ్రాసుకు వచ్చింది అని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదని అది చెప్పుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం నంద్యాల అసెంబ్లీ స్థానం ఇన్చార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించారట. ఆయనను తప్పించి మాజీ మంత్రి ఫరూక్ ని నియమించారట చంద్రబాబు.
ఇదే రకంగా మరో నాలుగు మార్పులు కూడా చేయబోతున్నారట చంద్రబాబు. ఆ లెక్కల ప్రకారం మంత్రాలయంలో తిక్కారెడ్డి స్థానంలో మాధవరం రాఘవేంద్ర ను నియమించబోతున్నారట. పత్తి కొండలో కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాం బాబు స్థానంలో, కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ కి ఇవ్వబోతున్నారట. నంద్యాల ఎంపీ మాండ్ర శివానందరెడ్డి స్థానంలో హైదరాబాద్ రియాల్టర్ నరసింహారావుకి సీటు ఇవ్వబోతున్నారట.
అలాగే కర్నూలు ఎంపీ కేంద్ర మాజీ మంత్రి కోట సూర్య ప్రకాష్ రెడ్డికి బదులుగా ఒక ఆసుపత్రి యజమానికి సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేశారని తెలుస్తుందని సాక్షి మీడియా హైలైట్ చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికి అయితే మంత్రాలయం టిడిపి ఇన్చార్జిగా తిక్కారెడ్డి కొనసాగుతున్నారు.