మోదీ సాహసం: పీవోకేను భారత్‌లో కలిపేస్తారా?

భారత్ లో ఉన్న కాశ్మీర్ భూభాగానికి మూడోంతుల ఎక్కువగా ఉంటుంది పీవోకే. అప్పట్లో స్వాతంత్య్రం వచ్చాక ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రు ఉన్న సమయంలో చేసిన అలసత్వానికి కారణం దాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకుందని చాలా మంది విశ్లేషకులు చెబుతుంటారు. అప్పట్లో ఇండియాలో ఉన్న 565 సంస్థానాలను భారత్ లో విలీనం చేసిన తర్వాత కూడా కాశ్మీర్ సమస్య అలానే ఉండిపోయింది. దీనికి కారణం అప్పటి రాజకీయ నాయకుల అలసత్వమే అని ఇప్పటికి చెబుతుంటారు.


ప్రస్తుతం పీఓకే అనేది సుదీర్ఘ కాలం నుంచి పెను సమస్యగా మారింది. దీని కోసం ఎంతో మంది సైన్యం కూడా మరణించారు. దాన్ని అంతర్భాగం ఎప్పుడూ చేస్తారని కాంగ్రెస్ నేత లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే కాశ్మీర్ కే స్వయం ప్రతిపత్తి ఉన్నంత కాలం వరకు పీఓకే ను కూడా అలానే చూస్తారు. ముందు కాశ్మీర్ ను భారత్ లో అంతర్బాగం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తే దాని మీద సుప్రీం కోర్టులో కేసులు వేస్తూ ఆర్టికల్ 370 చెల్లదని ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి.


సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికే మద్దతు పలుకుతూ తీర్పు నిచ్చింది. కాశ్మీర్ లో పీఓకే అంతర్భాగం కావాలంటే మరో రెండు మూడు నెలలు పట్టొచ్చని అనుకుంటున్నారు. పీఓకే లో ఉన్న చాలా మంది భారత్ లో కలుస్తామని అంటున్నారు. ఎందుకంటే భారత్ లోో ఎంతోో మంచి పరిపాలన సాగుతుందని రాబోయే కాలంలో పాకిస్థాన్ లో మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు.


అయితే పీఓకే ఇండియా వశం అయితే చైనాను కూడా కట్టడి చేయవచ్చు. అదే సమయంలో అమెరికా, యూరప్ దేశాలు కూడా భారత్ కు సపోర్టు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే డ్రాగన్ కంట్రీని ఎదుర్కొవాలంటే ఇండియాకు పీఓకే విషయంలో తప్పనిసరి సాయం అందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

pok

సంబంధిత వార్తలు: