రెండు చోట్ల ఓట్లూ తనకే కావాలంటున్న బాబు?
వైసీపీ అనుకూల ఓట్లను మాత్రం తీసేయించేందుకు టీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే వైసీపీ అభిమానులు ఒక వేళ తెలంగాణలో ఓటు వేస్తే వారికి సంబంధించి ఆంధ్రలో ఓటు ఉంటే మాత్రం కచ్చితంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి తీసేయిస్తుంది. అదే సందర్భంలో వైసీపీ, టీడీపీపై టార్గెట్ చేసి అలాంటి ఓట్లనే తీసేయించి ప్రయత్నం చేస్తున్నారు.
అయితే చంద్రబాబు రివర్స్ వ్యుహం ఏమిటంటే ఆయనకు సంబంధించి కచ్చితంగా టీడీపీ అనుకూల ఓట్లు హైదరాబాద్ లో ఉన్న వారు కచ్చితంగా ఆంధ్రలో కూడా ఓటేయాలని అనుకుంటున్నారు. ఇదే సందర్భలో వైసీపీ చెందిన అభిమానులు కానీ ఇతర పార్టీలకు చెందిన వారు ఉంటే మాత్రం వారి డూబ్లికేట్ ఓట్లను కచ్చితంగా తీసేయిస్తున్నారు. మరి దీని గురించి ఇంత చర్చ ఎందుకు నడుస్తుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీకి చెందిన వారివి చాలా వరకు నకిలీ ఓట్లు రెండు చోట్ల ఉన్నాయి. వాటిని కచ్చితంగా తీసేయాల్సిందేనని ఎలక్షన్ కమిషన్ ను అడుగుతున్నారు. కానీ టీడీపీ పై కూడా వైసీపీ నాయకులు ఇదే తరహాలో ఉన్న ఓట్లను తీసేయాలని అభ్యర్థిస్తే మాత్రం దానికి చంద్రబాబు ఒప్పుకోవడం లేదు. అంటే టీడీపీకి చెందిన వారి ఓట్లు రెండు చోట్ల ఉండొచ్చు. వారు తెలంగాణలో, ఆంధ్రలో రెండు చోట్ల ఓటు వేయొచ్చు ఇలా ద్వంద వైఖరితో చంద్రబాబు రివర్స్ గేమ్ ఆడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.