రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీసు అక్కడేనా?
ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా ఆ భవనంలోనే నివాసమున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ రూ.38 కోట్ల ఖర్చుతో ఈ క్యాంపు ఆఫీసు రూపు రేఖలు మార్చి ప్రగతి భవన్ గా నామకరణం చేసి 2016 నవంబరు లో ఎంట్రీ ఇచ్చారు. సచివాలయంలో తనకున్న ఛాంబర్ తో పాటు క్యాంపు ఆఫీసుగా ప్రగతి భవన్ వేదికగా.. అధికారిక కార్యకలాపాలు నిర్వహించేవారు.
అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి శకం మొదలైంది. గతంలో పాత సచివాలయాన్ని కూల్చి ప్రగతి భవన్ కట్టే సమయంలో ఈ నిర్ణయం అహంకార పూరతమైనది.. ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను కాస్తా ప్రజా భవన్ గా మార్చారు. మొన్నటి వరకు ప్రజా దర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించారు.
ఇప్పుడు ఏమో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసం కింద ప్రజా భవన్ కు కేటాయించారు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు ఆఫీసె ఎక్కడ? ఎక్కడ నుంచి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తారు అనేది నిన్నటివరకు సస్పెన్స్. కొత్త ఖర్చుతో కూడిన కొత్త భవనం ఎందుకు. నూతనంగా నిర్మించిన సచివాలయం ఉందిగా అక్కడే నుంచే పరిపాలన సాగించవచ్చుగా అనే చర్చా జోరుగా సాగింది. రేవంత్ మాత్రం జూబ్లిహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి హెచ్ ఆర్డీ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో తన క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేయబోతున్నారు.