తెలుగు రాష్ట్రాల్లో పొత్తులు బీజేపీకి కలసి రావా?

భారతీయ జనతా పార్టీ తనకు తానుగా పోటీ చేసినప్పుడు చాలా వరకు విజయాలు సాధించింది. కానీ పొత్తుకు వెళ్తే మాత్రం పరాజయం పాలైన సందర్భం ఏర్పడింది. 2019కి ముందు భారతీయ జనతా పార్టీ  తెలంగాణలో 21 శాతం ఓట్లను, ఆంధ్రప్రదేశ్ లో 18 శాతం ఓట్లను సాధించింది. అంతేకాకుండా నాలుగు పార్లమెంటు స్థానాలను, ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకుంది. అలాంటి సందర్భంలో కూడా వెళ్లి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది.


కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది బిజెపికి కలిసి వచ్చి పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలపడింది. తిరిగి 2004లో అదే రిపీట్ అవుతుందనుకుంటే  సాధ్యపడలేదు. 2009లో అయితే 2 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరిగి 2014లో మోడీ హవాతో సక్సెస్ సాధిస్తాం అనుకున్న తరుణంలో తిరిగి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది భారతీయ  జనతా పార్టీ. అప్పుడు కూడా నాలుగు అసెంబ్లీ సీట్లతో సర్దిపెట్టుకొనే పరిస్థితి ఏర్పడింది.


దాంతో పురోగమించే పొజిషన్ లో కూడా తిరోగమించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు  తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో కలిసి ఉంది అనే ప్రచారం కొనసాగుతోంది. అలాగే బండి సంజయ్ ని పదవి నుండి తీసేయడం, అలాగే కవితను అరెస్టు చేయకపోవడం ఇవన్నీ ఈ ప్రచారానికి బలాన్ని ఇస్తున్నాయి. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన భారతీయ జనతా పార్టీ 8సీట్లతో, అలాగే  14శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోబోతుంది అనే విషయం తేటతెల్లమవుతుంది. దీనికి నిదర్శనంగా పురందరేశ్వరి దేవి అలాగే సుజనా చౌదరి, సీఎం రమేష్ ల వ్యవహార శైలి  చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. మరోపక్క దీనికి తోడుగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి కూడా ఇదే సంకేతం అందుతుంది. మరి ఇప్పుడైనా బిజెపికి కలిసి వస్తుందో లేదో చూడాలి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: