అమెరికాను తిప్పలు పెడుతున్న ఆ రెండు యుద్దాలు?

రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కానీ పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. కొన్నాళ్ల పాటు దాడులు చేయకుండా స్థబ్ధుగా ఉన్న రష్యా.. ఇటీవల కాలంలో దాడులు తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఉక్రెయన్ ను అండగా నిలబడిన అన్ని పాశ్చాత్య దేశాలు ప్రస్తుతం అంతగా ఆసక్తి చూపడం లేదు. యుద్ధానికి ముందు ఆర్థికంగా అండగా నిలిచిన ప్రస్తుతం ముఖం చాటేస్తున్నాయని జర్మనీకి చెందిన కెయిల్ ఇన్ స్టిట్యూల్ తమ పరిశోధనలో తెలిపింది.


ఉక్రెయిన్ కు మద్దతుదారులు తగ్గిపోయారని, యుద్ధానికి ముందు ఆ దేశానికి రక్షణ రంగంతో పాటు ఆర్థికంగా సాయం చేసిన దేశాలు క్రమంగా తమ మాటను వెనక్కి తీసుకుంటున్నాయి. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఉక్రెయిన్లకు సాయానికి స్వస్తి చెబుతామని బాహాటంగానే చెబుతున్న రిపబ్లికన్లు వైఖరి వల్ల అధికార డెమోక్రటిక్ లకు ఇబ్బందిగా మారింది. దీంతో సాయం విషయంలో అమెరికా అనిశ్చితిలో పడింది.


ఇక  రెండో విషయానికొస్తే హమాస్ ఇజ్రాయెల్ దాడులు. ఆది నుంచి అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తోంది.  దాడులు జరుగుతున్న సమయంలో జోబైడెన్ ఇజ్రాయెల్లో పర్యటించారు కూడా.  ఆ దేశానికి ఆర్థిక సాయంతో పాటు యుద్ధ ట్యాంకులు, అణు క్షిపణులు తదితర యుద్ధ సాయం అమెరికా చేస్తోంది.  


అయితే రష్యాపై ఉక్రెయిన్ ను, హమాస్ పై ఇజ్రాయెల్ పై దాడులు చేసేందుకు ఉసిగొల్పింది అమెరికానే.  ఈ రెండు దేశాల వెనుకే ఉంటూ ఆర్థిక సాయం, యుద్ధ సామగ్రిని అందిస్తూ వస్తోంది.  ఆ రెండు దేశాలకు సాయం చేసేందుకు 150 బిలియన్ డాలర్లు అగ్రరాజ్యానికి అవసరం అవుతున్నాయి. ఇజ్రాయెల్ కు 100 బిలియన్ డాలర్లు, ఉక్రెయిన్ కు 50 బిలియన్ డాలర్లు బడ్జెట్ కావాలి.  కానీ నిధుల విడుదలకు సెనెట్ అడ్డు పడుతోంది.  మరోవైపు ట్రంప్ వర్గం ఈ సహాయాన్ని దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మొత్తంగా చూస్తే అమెరికాను నమ్ముకున్నందుకు అటు ఉక్రెయిన్, ఇటు ఇజ్రాయెల్ ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

war

సంబంధిత వార్తలు: