అమెరికా ఇండియాతో గేమ్స్ ఆడుతోందా?

అమెరికా వ్యవహరించే తీరు ఎప్పుడూ ఆశ్చర్యం గానే ఉంటుంది. తమ దేశం కోసం అమెరికా ఏదైనా చేయవచ్చు.. అదే వేరే దేశం తమ భద్రత, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకునే చేసే పనులకు మాత్రం అగ్రరాజ్యం అడ్డు తగులుతూ ఉంటుంది. ఉగ్రవాదంపై పోరు సాగిస్తున్న భారత్ కు అండగా నిలవాల్సిన అమెరికా మనపైనే కుట్ర కేసులు పెట్టించి ఇరుకున పెట్టాలని చూస్తోంది.


ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ అంశం చూసుకుంటే లుమాంబా ప్లాట్ పేరుతో అప్పటి కాంగో ప్రధాని ఉమాంబా ను 1964లో హతమార్చిన తీరుపై ఓ వ్యక్తి పుస్తకాన్ని వెలువరించారు. అలాంటి అమెరికా గడ్డపై ఖలీస్తానీ ఉద్యమ కారుడిని హతమార్చడానికి పన్నిన కుట్రలో భారత్ అధికారి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. ఇటీవల జూన్ లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ విషయమై భారత్ ను హెచ్చరించినట్లు తెలుస్తోంది.


అమెరికా ప్రభుత్వ అటార్నీ విలియమ్స్ 15పేజీల అభియోగ పత్రాన్ని న్యూయార్క్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.  ఈ కుట్ర లక్ష్యం ఎవరు అనే పేరు ప్రస్తావించకున్నా.. పర్వంత్ సింగ్ పన్నూ అని అక్కడి మీడియా చెబుతోంది. గతంలో దుండగుల కాల్పుల్లో కెనడాలో మరణించిన నిజ్జర్ హత్య వ్యవహారంలో కూడా  భాతర్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు అక్కడి మన దౌత్యవేత్తను సైతం తొలగించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను మన దేశం నుంచి బహిష్కరించింది.


తాజాగా అమెరికా కూడా ఇదే తరహా ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రెండు మిత్రదేశాల మధ్య ఇటువంటి భేదాలు రావు. ప్రస్తుతం అమెరికా మన దేశంతో సన్నిహితంగా ఉంటుంది. చైనాను నిలువరించాలంటే భారత్ సాయం తప్పకుండా కావాలనే అభిప్రాయంతో మనకు స్నేహ హస్తం చాస్తోంది. పన్నును హత్య చేయించడానికి ఇండియా కుట్ర పన్నిందన్న ఆరోపణలు అమెరికాతో మన సంబంధాలను దెబ్బ తీయకపోవచ్చు కానీ విదేశాల్లో మాత్రం ఇండియా ప్రతిష్ఠను మసకబారిందచే సూచనలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: