జగన్‌పై ఎల్లో బురద.. కడుక్కోగలడా?

తన కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వారి కంట్లో నలుసుని వెతకడం, ఎత్తి చూపడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి విద్యలో ఎల్లో మీడియా ఆరితేరింది. నిత్యం జగన్ మోహన్ రెడ్డిపై విషపు రాతలతో విరుచుకుపడుతున్నారు. ఎల్లో మీడియాలో రాసే ప్రతి అక్షరం జగన్ కు వ్యతిరేకమే. ఆయన్ను తప్పు పట్టడమే. ఏపీలో అభివృద్ధి దారుణంగా పడిపోయిందని.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని  దీనికి జగన్ సర్కారే కారణం అంటూ రాసుకొస్తుంటారు.

తాజాగా తప్పు ప్రభుత్వానిది నష్టం పంచాయతీలకు అనే కథనం ఎల్లో మీడియా ప్రచురించింది. ప్రభుత్వ తప్పిదాలకు గ్రామ పంచాయతీలు నష్టపోతున్నాయి. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడం, ఆదేశాల అమలులో జాప్యంతో కేంద్రం రూ.2139.40 కోట్లు నిలిపివేసింది. ఆర్థిక సంఘం నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమవ్వాలి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నిధులను మళ్లించే వీలుండదర్నది కేంద్రం ఆలోచన .

రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయాలి. స్థానిక సంస్థల పరిధిలో నుంచి వివిధ పద్దుల కింద ప్రభుత్వానికి జమయ్యే ఆదాయంలో ఎంత మొత్తం పంచాయతీలకు కేటాయించాలో ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధుల్లో పంచాయతీ పరిపాలన ఖర్చులకు నిర్దేశించిన 10శాతంలోనే విద్యుత్తు బకాయిలు చెల్లించాలి. పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా విద్యుత్తు సంస్థలకు మళ్లించాలి. ఇది వార్త సారాంశం.

అయితే క్రమంగా విద్యుత్తు బకాయిలు కడుతుంటే 10శాతంలోపే చెల్లించాలి. కానీ టీడీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించారు. ఆ బకాయిలను వైసీపీ ప్రభుత్వం కడుతోంది. బకాయిల పెండింగ్ కారణంగా కేంద్రం నిధుల విడుదలను ఆపితే దానిపై విషం చిమ్ముతున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ ఈ నిధులను వేరే పథకాలకు మళ్లించలేదు. టీడీపీ పాలనలో కూడా బకాయిలు కట్టకపోతే కేంద్రం నిధులను ఆపింది. అప్పుడు ఆర్థిక సంఘం నిధులు ఎలా ఖర్చు పెట్టాలో మాకు తెలియదా అంటూ చంద్రబాబు ఫైరయ్యారు. నిధులు ఇవ్వడం లేదంటూ ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: