తెలంగాణ రిజల్ట్స్‌ డిసైడ్‌ చేసే ట్రెండ్స్‌ ఇవే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్ల నాడి పట్టేందుక అనేక సర్వే సంస్థలు ప్రయత్నించాయి. సర్వే ఫలితాలు కూడా వెల్లడించాయి. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఓ సర్వే సంస్థం కాంగ్రెస్ కు, మరొకటి బీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెడుతున్నాయి.

2018 ఎన్నికలతో పోల్చితే మాత్రం ఈ సారి ఓటరు నాడి కనిపెట్టడం అత్యంత కష్టంగా మారింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ కూటమి తో ముక్కోణపు పోటీ నెలకొంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చాలా చోట్ల ముక్కోణపు పోటీ ఉండే అవకాశాలు అత్యంత తక్కువగా  కనిపిస్తున్నాయి. ఆ సమయంలో ఎవరికీ అంతగా మెజార్టీలు రాకపోయినా బొటాబొటీగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కానీ 2018 ఎన్నికలకు వచ్చే సరికి ఆ వేవ్ స్పష్టంగా కనిపించింది. లగడపాటి రాజగోపాల్ లాంటి వ్యక్తులు బయటకి వచ్చి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహా కూటమి గెలుస్తుందని చెప్పినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికే వారు డిసైడ్ అయిపోయారు. ఎవరికి ఓటు వేయాలో అని. అదే సందర్భంలో పలువురు రాజకీయ అనుభవజ్ఞులు కూడా బీఆర్ఎస్ గెలవబోతుంది అని చెప్పుకొచ్చారు.

కానీ ఈ సారి ఎన్నికలు అలా ఊహించడానికి కూడా లేదు. ఓటరు నాడి విషయంలో స్పష్టత లేదు. చాలా ఉత్కంఠగా ఉంది. ఎవరూ గెలుస్తారో అనే ఆందోళన, భయం అన్ని పార్టీల్లో నెలకొంది.  అనేక సందర్భాల్లో ప్రజలు ఎక్జిట్ పోల్స్, రాజకీయ నిపుణుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా తీర్పుని ఇచ్చారు. ఒకటి అయితే మాత్రం చెప్పవచ్చు. 2018తో పోల్చితే బీఆర్ఎస్ మాత్రం కొంతమేర ఎదురు ఈదుతోంది. ఆరు నెలల క్రితం ఏమీలేని కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకొని బీఆర్ఎస్ కు సవాల్ విసురుతుంది. బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో బలంగా ఉండి ఎవరి ఓట్లకు గండికొడుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: