కేసీఆర్ వ్యూహం: కాంగ్రెస్ గాలి తగ్గుతోందా?
దీంతో అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాలో కూడా కాంగ్రెస్ గెలవబోతుంది అనే గెలిచేసింది అనే హైప్ ని జనంలోకి చాలా బలంగా పంపిచారు. అదే సందర్భంలో పలు లోపాలు కూడా ఆ పార్టీని వెంటాడుతున్నాయి. చాలా చోట్ల బలమైన నాయకులు లేకపోవడం ఆ పార్టీ కి పెద్ద మైనస్ గా చెప్పవచ్చు.
ధనం, మంది బలం ఉన్న నాయకులు ఒక 30-40స్థానాల్లో ఉన్నారు. కేవలం ధనం మాత్రమే ఉన్న నాయకులు మరో 30 చోట్ల ఉన్నారు. జనంలో అంతగా పలుకుబడి లేకపోయినా డబ్బుతో మేనేజ్ చేసే వాళ్లు. ఈ 60 స్థానాలనే కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముకుంది. ఇక మిగతా స్థానాల్లో విజయం ఆ పార్టీకి కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన స్థానాలను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ రాని వారు.. అసంతృప్తులను లక్ష్యంగా గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారు.
మరోవైపు మొన్నటి వరకు ఉన్న హైప్ క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ను ఓడించడం మే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ మరో కీలకమైన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అదేంటంటే తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న తమది తప్పు అయితే 55 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చేసిందే తెలంగాణకు అన్యాయం జరిగింది అని మరి తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ను ఎలా నమ్మాలి అని ఓటర్లను ఆలోచించేలా చేశారు.