బర్రెలక్క గెలిచి తీరాలి.. ఎందుకంటే?

బర్రెలక్క.. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్‌ చేస్తే వెంటనే కనిపించే పేరు. ఆమె వీడియోలు, పోస్టులు సంచలనం సృష్టస్తున్నాయి. జనం వేల, లక్షల వ్యూస్‌తో ఆదరిస్తున్నారు. మనుషుల్లోని విలువలని, పరిస్థితులు వెలికితీస్తాయనడానికి బర్రెలక్క ఓ ఉదాహరణ. బర్రెలక్కగా ఫేమస్ అయిన శిరీష కూడా అటువంటి వ్యక్తే. తాను ఒక ఆడపిల్ల, కిందికులాల నుండి వచ్చింది. కానీ ఆమె అసంకల్పితంగా చేసిన ఓ వీడియో మొదట్లో ఆమెకి అనేక కష్టాలు తెచ్చిపెట్టింది. కానీ.. ఆ కష్టాలు తెగింపుని, ఆ తెగింపు శిరీషను ఒక పోరాటంలోకి నెట్టాయి. అనూహ్యంగా అది చివరకు బర్రెలక్క ఎన్నికల్లో నామినేషన్‌కి దారితీసింది.


మరి బర్రెలక్కను ఏం చూసి ఎన్నుకోవాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అది నిజమే.. కానీ చదువురాని, సాటి మనుషుల అవసరాల పట్ల అవగాహనలేని ఎమ్మెల్యేలు మాత్రం లేరా?  సాటి మనుషులని దోచుకోవడానికి, రాజకీయాల్ని ఒక వ్యాపారంగా మార్చుకున్న ఎమ్మెల్యేలు ఎందురు లేరు. అలాంటి వారితో పోల్చుకుంటే కష్టాలు అనువేకమైన ఒక కిందికులస్తురాలైన ఈ ఆడపిల్ల చాలా బెటర్. కనీసం సమస్యల పట్ల సానుభూతైనా శిరీషకు వుంటుంది కదా.


మనం ఎన్నుకునే నేతలు.. రేపు ఎన్నికలయ్యాక ఎవరు ఎంతకు అమ్ముడుపోతారో ఎవరికీ తెలియదు. ఒక్క అసెంబ్లీ సీటుకోల్పోవడం వల్ల ఆయా రాజకీయ పార్టీ అభిమానులకు పోయేదేమీ పెద్దగా ఏమీ ఉండదు. స్థానిక పోటీదారులైన ముగ్గురు నలుగురు పాతుకుపోయిన ఎమ్మెల్యే పోటీదారులకు తప్ప ఎవరికీ నష్టం ఉండదు.  కాబట్టి అన్ని పార్టీల అభిమానులూ బయటికి రాలేకపోయినా బర్రెలక్కకు లోపలి మద్దతునైనా ప్రకటించాలి.


బర్రెలక్కకి ఓటేయడం ఒక ధిక్కారానికి ప్రకటన అవుతుంది.  అది కులం, డబ్బు, అధికారం, బలిసిపోయినతనం మీద ఒక నిరసన ప్రకటన అవుతుంది.  అది అన్ని పార్టీల పట్ల సమ దూరం ప్రకటిస్తుంది. తెలంగాణాకు చెందిన ఒక బహుజనవాదం బలపరచడం అవసరం. ఒక ప్రజా అవసరాన్ని నొక్కి చెప్పే సందర్భం ఇది. రోజూ మాట్లాడుకునే అభ్యుదయాన్ని ఆచరణలో చూపించేందుకు ఇది ఓ అవకాశం. బర్రెలక్కకు అందుతోన్న అన్ని రకాల మద్దతు, ఒక మంచి పనికి దక్కుతోన్న ఆదరణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: