ఆంధ్రా అభివృద్ధి.. ఈ లెక్కలు చూడండి?

ఏపీలో ఆర్థిక వ్యవస్థల గురించి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య వాదనలు కొనసాగుతున్నాయి. తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధులు ఆరోపిస్తుంటే… లేదు సాక్ష్యాలు ఉన్నాయంటూ ఈ సారి ఏకంగా ఆర్బీఐ గణాంకాలతో కూడిన లెక్కలను వివరించారు.


ఆర్థిక మందగమనం, కొవిడ్ సంక్షోభాలను అధికమించి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వరుసగా నాలుగేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తితో పాటు వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగం, నిర్మాణ, తయారీ తదితర అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాల ద్వారా 2022-23 కి సంబంధించి ఏ మేరకు వృద్ధి పెరిగిందో ఆర్బీఐ గురువారం రాష్ట్రాల వారీగా నివేదికలు విడుదల చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం 2019-20 నుంచి 2022-23 వరకు వరుసగా నాలుగేళ్లు రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ పెరుగుతూనే ఉందని పేర్కొంది. 2018-19లో చంద్రబాబు హయాంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ రూ. 8,73,721.11 కోట్ల ఉండగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో రూ.13,17,728.15 కోట్లకు చేరింది.


అంటే నాలుగేళ్లలో స్థూల ఉత్పత్తి రూ.4.44లక్షల కోట్లకు పైగా పెరగడం గమనార్హం. కొవిడ్ లాంటి సంక్షోభాలు లేన్నప్పటికీ టీడీపీ హయాంలో వ్యవసాయ రంగం వృద్ధి తిరోగమనంలోకి వెళ్లినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. గత నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ 50.81శాతం పెరగ్గా ఏటా వార్షిక వృద్ధి రేటు 12.70శాతం నమోదైంది. కొవిడ్ సంక్షోభ సమయంలో వైసీపీ రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.


వ్యవసాయం, దాని అనుబంధ రంగాల కార్యకలాపాలు సాగేలా చర్యలు తీసుకుంది. దీంతో వరుసగా నాలుగేళ్లు రెండెంకల వృద్ధి నమోదైంది. ప్రస్తుత ధరల ప్రకారం చంద్రబాబు హయాంతో పోల్చితే 2018-19లో వ్యవసాయ రంగం వృద్ధి 5.42 మేర క్షీణించినట్లు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. ఇవే కాక పారిశ్రామిక రంగం, సేవా రంగంలోను భారీ వృద్ధి సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: