విశ్రాంతిలోనే వ్యూహాలకు పదునుపెడుతున్న బాబు?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్ పై బయటకి వచ్చిన చంద్రబాబు పక్కా వ్యూహాలతోనే ముందుకు కదులుతున్నారు. ఒకవైపు జనసేనతో పొత్తు ఖరారు చేసుకున్న తర్వాత రెండు పార్టీల మధ్య సమన్వయ సమావేశాలు (నియోజకవర్గ స్థాయిలో) ఏర్పాటు చేసుకునేందుకు చంద్రబాబు అనుమతి ఇచ్చారు.  పవన్ కల్యాణ్ అడగ్గానే అంగీకరించారు. తద్వారా రాబోయే ఐదారు నెలలు అంటే ఎన్నికల్లోగా సమన్వయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.


విభేదాలు ఆదిలో రావొచ్చు. ఆ తర్వాత అవే సర్దుకుంటాయి. మరోవైపు ఎన్నిస్థానాలు జనసేనకు కేటాయించాలనే దానిపై చంద్రబాబు దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంది. దానికి సంబంధించిన సమాచారం పవన్ కి కూడా చెప్పారు. ఆ తర్వాతనే ఇరు పార్టీల మధ్య పొత్తు అంగీకారం కుదిరింది. కాకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు 50-60 స్థానాలు కావాలని పట్టుబడుతున్నారు. చంద్రబాబు మాత్రం 30లోపు స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ స్థానాల విషయంలో కూడా చంద్రబాబు పక్కా వ్యూహంతో ఉన్నారు.


ఆ విషయంలో ఇరు పార్టీల మధ్య కొంత గ్యాప్ ఉంది. దీనిని నాదెండ్ల మనోహర్ ద్వారా సరిచేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. మరోవైపు మధ్యంతర బెయిల్ కాస్తా శాశ్వత బెయిల్ లా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. క్వాష్ పిటిషన్ తీర్పు కోసం ఎదురు చూస్తూనే.. మరోవైపు మిగతా కేసుల విషయాల్లో ఎలా వాదనలు సాగాలి అనే అంశంపై లాయర్లకు సైతం దిశానిర్దేశం చేస్తున్నారు.


భారతదేశ చరిత్రలో ఒక పేషేంట్ కి అంబులెన్స్ ఎప్పుడూ వెంట ఉండాలి అనే సూచన చేసిన మొదటి ఆసుపత్రి బహుశా ఏఐజీ ఆసుపత్రేనని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఏ ఆసుపత్రి అయినా సరే ఫలానా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుందే కానీ అంబులెన్స్ వెంట ఉండాలి అని చెప్పడం ఎవరూ ఊహించనదే. జగన్ ని దెబ్బకొట్టేందుకు బీజేపీతో కలిసి వెళ్లడామా లేదా అనేది తెలంగాణ ఫలితాల తర్వాత తేలనుంది. ఇలా బాబు తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూనే ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: