కరువు అస్త్రంతో జగన్ను ఇబ్బంది పెట్టగలరా?
కరవుపై సమీక్షలు లేవని ఆరోపిస్తోంది. వాళ్ల ఉద్దేశంలో కరవుపై చంద్రబాబు సమీక్షలు చేసి… దానిని నివారించారు అదే జగన్ మోహన్ రెడ్డి చేయడం లేదనేది వారి భావన. వాస్తవానికి చంద్రబాబు కరవుపై సమీక్షల పేరిట విపరీతమైన ప్రచారం పొందారు. ఒకవేళ చేసి ఆయన ఆ పరిస్థితులను నివారిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొనేది కాదు. వర్షాల సమయం అయిపోయిన తర్వాత ఏయే ప్రాంత రైతులకు ఎంత నష్టం వచ్చింది అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని కరవును ప్రకటిస్తారు.
ఒకవేళ పంట వేసి మధ్యలో నష్టపోతే పంటబీమా సౌకర్యం ఉంది. పంట వేయలేకపోతే కరవు సాయం అందిస్తారు. దీనిపై సమీక్షలు జరిపి ఏదో చేస్తున్న ప్రచారం మినహా రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కరవును నివారించాలంటే రెండే పరిష్కార మార్గాలు. ఒకటి నీటి పారుదల సౌకర్యం మెరుగు పరచడం. అన్నీ ప్రాంతాలకు కాల్వల ద్వారా నీటిని అందించడం. దీనికోసం కొత్తగా ప్రాజెక్టుల కట్టడం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. మరోకటి అక్కడ పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించడం. ఇది అస్సలు సాధ్యపడదు. ఎందుకంటే పరిశ్రమలకు నీటి సౌకర్యం ఉండాలి. ప్రజలను రెచ్చగొట్టేందుకు ఈ తరహా వార్తలు రాస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.