టీడీపీ, జనసేన, బీజేపీ.. బాబు ప్లాన్ ఫలిస్తుందా?
కానీ అక్కడ నిజం మాత్రం వేరు అని అంటున్నారు కొంతమంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలిసి ముందుకు వెళ్లడానికి సిద్ధంగా లేదని అంటున్నారు. పైగా భారతీయ జనతా పార్టీ జనసేనతో ముందుకు వెళ్దామని అనుకుంటుందని వాళ్ళు అంటున్నారు. దాంతో నాలుగు సీట్లు జనసేనకి ఎక్కువ ఇచ్చి అయినా సరే తెలుగుదేశం జనసేనతో కలిసి వెళ్దాం అని అనుకుంటుంది. అంతేకాకుండా తెలుగుదేశం వ్యూహం ప్రకారం తెలుగుదేశం జనసేన అలాగే కమ్యూనిస్టులతో కూడా కలిసి పోటీ చేయాలని అనుకుంటుందని తెలుస్తుంది.
చంద్రబాబు నాయుడు వ్యూహం ఓ పక్కన ఇలా ఉంది. అయితే చంద్రబాబు వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ చెదరగొట్టకుండా ఉంటే అంతా మంచి జరుగుతుంది తెలుగుదేశం వాళ్లకు. ఇలా జరుగుతుందేమోనని భయపడ్డ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీని పక్కనపెట్టి మరీ జనసేన అలాగే కమ్యూనిస్టులతో పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. మొన్నటి వరకు సీట్ల విషయంలో గిరి గీసుకుని కూర్చున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దిగిరాక తప్పదు.
ఇప్పుడు ఎంతో కొంత జనసేన అలాగే కమ్యూనిస్టులకు వారికి కావాల్సిన సీట్లను ఇచ్చే తీరాలి. అలా జరగని పక్షంలో జనసేన అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తోనే ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. ఇంకా ఇక్కడ కమ్యూనిస్టులు అయితే కొంతవరకు చంద్రబాబు నాయుడు మాట వినే అవకాశం ఉంటుంది. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.