అద్భుతం.. ఒక్క తాటిపైకి కమ్మ, రెడ్డి కులాలు?

రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలే ఆర్థికంగా బలమైనవి. పదవుల కోసం పోటీ పడే క్రమంలో ఆ రెండు కులాలు బద్ధ శత్రవులు. ఆ రెండు సామాజిక వర్గాల గణనీయమైన ఓటు బ్యాంకు కలిగి ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి, రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ కు, ప్రస్తుతం వైసీసీపి బలమైన మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. అయితే ఈ రెండు సామాజిక వర్గాలు ఏకతాటిపైకి రావడం అరుదైన అంశం.


అయితే రాజకీయ అవసరాల కోసం టీడీపీలో రెడ్డి సామాజిక వర్గ నేతలు, వైసీపీలో కమ్మ నేతలు ఉన్నారు. జనాభా ప్రాతిపాదికన తక్కువగా ఉన్న ఈరెండు సామాజిక వర్గాలే రాజ్యాధికారం దక్కించుకోవడం మిగతా సామాజికవర్గాల వారు సహించలేకపోతున్నారు. బలమైన కాపు సామాజికవర్గంతో పాలు బలహీనవర్గాల సాయంతో ఆ రెండు పార్టీలు అధికారాన్ని చెలాయిస్తూ వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండు వర్గాలు ఏకతాటిపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.


తెలంగాణ ఎన్నికల్లో గతంలో చూడని విధంగా చిత్రవిచిత్రాలు చోటు చేసకుంటున్నాయి. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు ఏకతాటిపైకి రావడం విశేషం. ఈ రెండు వర్గాలు వేర్వేరు కారణాలతో కాంగ్రెస్ కు మద్దతివ్వడం విశేషం. చంద్రబాబుని రాజకీయంగా సీఎం కేసీఆర్, బీజీపీ అగ్రనేతలు ఇబ్బంది పెట్టారన్న అనుమానం కమ్మ సామాజిక వర్గంలో ఉంది. ఈ క్రమంలో వారికి బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ కు ఓటేయాలని కృత నిశ్చయంతో ఆ వర్గం వారు ఉన్నట్లు తెలుస్తోంది.


దొరల పాలన పోయి రెడ్ల రాజ్యం రావాలని ఆ సామాజిక వర్గం కోరుకుంటుంది. ఇప్పటికే తెలంగాణలో రెండేళ్లు వరుసగా అధికారానికి దూరంగా ఉండటం.. రెడ్డిసామాజిక వర్గంపై కేసీఆర్ కత్తులు దూయడం తదితర కారణాలతో ఎలాగైనా ఓడించాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు. మరి అందివచ్చిన ఈ అపురూప అవకాశాన్ని కాంగ్రెస్ ఏ మేర సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: