చైనా సరిహద్దుల్లో భారత సైన్యం.. తగ్గేదేలే?
ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇరు దేశాలు తమ సరిహద్దుల వద్ద వేలమంది సైనికులను మోహరించడం చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు రెండు దేశాల మిలటరీ మధ్య సరిహద్దు వివాదంపై సుమారు 20 సార్లు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా ఆయా దేశాలు తమ సైన్యాలను వెనక్కి తీసుకున్నాయి. అయితే సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య భిన్నమైన వాదనలు ఉన్నాయి. భారత్ తన సరిహద్దు 3488 కిలోమీటర్లు అని చెబుతుండగా.. చైనా 2000కి.మీ. అనే పేర్కొంటుంది.
అయితే లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీ వద్ద చైనా తమ కార్యకలాపాలను పెంచుతూ ఉంది. భారీగా సైనికులను మోహరిస్తున్న డ్రాగన్ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. అండర్ గ్రౌండ్ స్టోరేజీలు, కొత్త రోడ్లు, సైనిక పౌర వినియోగానికి వీలుగా కొత్త ఎయిర్ పోర్టులు, హెలీ ఫ్యాడ్లు నిర్మిస్తోంది. దీనికి ప్రతిగా భారత్ కూడా కొన్ని సమీప గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.
అయితే చలికాలం అయితే మన సైన్యం వెనక్కి తగ్గుతుంది అని చైనా భావిస్తోంది. అందులో భాగంగా ఏటా శీతాకాలంలో సైన్యం సంఖ్యను పెంచడం వంటివి చేస్తోంది. చైనాతో కొనసాగుతున్న వివాదం వల్ల భారత్ తూర్పు లద్దాక్ లో 50 వేల మంది సైనికులను మోహరించినట్లు అంచనాలున్నాయి. దీనికి రక్షణ రంగానికి భారీగానే నిధులు వెచ్చించాల్సి ఉన్నా.. కేంద్రంలోని మోదీ సర్కారు ఈ విషయంలో తగ్గేదే లే అన్నట్లు వ్యవహరిస్తోంది.