మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?

పీల్చే గాలి.. తాగే నీరు.. తినే తిండి.. ఉండే ఆవాసం.. కట్టుకునే దుస్తులు.. మొక్కే దేవుడు... ఆచరించే మతం ఇవన్నీ ఒక మనిషికి సంబంధించిన కనీస ఇష్టాలు. వీటిని ఇతరులు ప్రభావితం చేయడానికి వీల్లేదు. కానీ మత చాంధసవాదాన్ని అణువణువూ ఒంట పట్టించుకొని కొందరి తీరు వల్ల ప్రపంచం ప్రమాదపు అంచున నిలిచింది. తమ మతాన్ని విస్తరించాలనుకునే ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు రోజురోజుకీ పెరిగిపోతుండటం.. వారికి కొన్ని ఇస్లామిక్ దేశాలు ఆర్థిక సహకారం అందించడం లాంటి కారణాల వల్ల ప్రపంచంలో దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.


దాదాపు 86 దేశాల్లో ఉగ్ర మూకలు అరాచకాలు సృష్టిస్తున్నారు.  కనీ వినీ ఎరుగని  ఘెరాలు చోటు చేసుకుంటున్నాయి.  చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఆ దుర్మార్గుల బారిన పడి నరకం చూస్తున్నారు.  ప్రపంచ వినాశానికి వీరు తమ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పవచ్చు.
పాలస్తీనా లో పురుడు పోసుకున్న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ లో లో కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేసి అల్లకల్లోలం సృష్టించారు. వీరి అంతిమ లక్ష్యం వారి మతం వారు మాత్రమే ఉండంటం కాదు. బలవంతంగా అందర్నీ తమ మతంలోకి మార్చడం. వారి రాజ్యం మాత్రమే విలసిల్లేలా చేయడం.


ఇక్కడ మాత్రమే కాదు. నైజీరియాలో బోకో హరామ్, లెబనాన్ లో హిజుబుల్లా, ఇరాక్, సిరియా దేశాల్లో ఐసీసీ, అఫ్గాన్ లో తాలిబన్లు, పాకిస్థాన్ లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రమూకల ముఖ్య ఉద్దేశం అదే. చాంధసవాద ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం. ఈసారి వీరిని అంతం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలో ఉగ్ర సంస్థలన్నీ ఒకటవుతాయి. అప్పుడు ఉగ్రసంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న దేశాలన్నీ యుద్ధంలోకి వస్తాయి. అదే జరిగితే యూరప్ దేశాలు కూడా యుద్ధంలో పాల్గొంటాయి. తద్వారా మూడో ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: