వైసీపీకి పురందేశ్వరి భయం పట్టుకుందా?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరీ వైసీపీని దెబ్బతీసేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులు అవినీతి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మిగతా మంత్రుల దగ్గర అన్ని విషయాలను చెబుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో వైసీపీకి పురందేశ్వరీకి ఒక్క నిమిషం కూడా పడటం లేదు. ఎందుకంటే వైసీపీ పురందేశ్వరీని విమర్శిస్తూ ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేయడం లేదని ఆమె టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.


అయితే సోము వీర్రాజు ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయన ఎక్కువగా కేంద్ర నాయకత్వం వద్దకు వెళ్లి వివరాలు చెప్పేవాడు కాదు. ఆర్ ఎస్ ఎస్ లో పని చేసిన వ్యక్తిగా ఈయనకు అనుభవం ఉన్నా కూడా దాన్ని వాడుకుని ఇక్కడ వైసీపీ నాయకులపై మాటల దాడిని కొనసాగించేవారు. ఇలా చేయడం వల్ల అనేక రకాలుగా వైసీపీని రాష్ట్రంలో ఇబ్బంది పెట్టగలిగాడు.


కానీ దాన్ని కేంద్రం స్థాయిలోకి తీసుకెళ్లి సక్సెస్ కాలేకపోయారు. అయితే పురందేశ్వరీ మాత్రం ఈ విషయంలో సక్సెస్ అవుతున్నారు. రాష్ట్రంలో బీజేపీని ఆమె పెంచే స్థాయిలో లేకున్నా ఇక్కడ వైసీపీ అనుసరిస్తున్న విధానాలను మాత్రం ఆమె కేంద్రంలో ఉన్న నేతలకు మాత్రం కూలంకషంగా చెబుతున్నారు. ఇలా చెప్పడం వల్ల వైసీపీ గురించి వివరాలు తెలుసుకోవడంతో పాటు పురందేశ్వరీ చాలా బాగా పని చేస్తుందనే నమ్మకం బీజేపీ అధిష్టానానికి కలుగుతుంది.


బీజేపీని నమ్ముకుని పని చేసిన సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అంతే కాదు బీజేపీ ఎక్కడైనా సరే నిలబడి పోటీ చేసింది. కానీ పురందేశ్వరీ మాత్రం టీడీపీ కి పని చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. బీజేపీకి తక్కువ.. టీడీపీకి ఎక్కువ అని ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద వైసీపీ ప్రభుత్వ అవినీతిని కేంద్రం వద్దకు తీసుకెళ్లడంలో పురందేశ్వరీ సక్సెస్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: