అది బీఆర్ఎస్‌కు అతిపెద్ద మైనస్‌ అవుతోందా?

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఆయా పార్టీల అగ్రనేతలు పర్యటనలు వారి విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు బీఆర్ఎస్ పై కుటుంబ పాలన సాగిస్తోందని విమర్శలు గుప్పించారు.  దీనికి ప్రతిగా ఆ  పార్టీ నేతలు ధీటుగానే స్పందిస్తున్నారు.


అయితే రాహుల్ గాంధీ విమర్శలు చేసే ముందు ఆయన కుటుంబ నేపథ్యం కూడా చర్చకు వస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వీరంతా దేశాన్ని పాలించిన వారే.  బీజేపీ విషయానికొస్తే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి కుటుంబ పాలన లేదు.  ప్రధాని మోదీ తర్వాత  ఆ పదవి ఎవరు చేపడతారో తెలియదు. బీజేపీ కి నాయకత్వం ఎవరు వహిస్తారో  చెప్పలేం.  మన రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా మనం ఊహించలేం.


కానీ బీజేపీ నేతల కుటుంబాలు మాత్రం రాజకీయాల్లో ఉన్నాయి. అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అతను క్రీడా రంగానికి ఎలాంటి ప్రాతినిధ్యం వహించలేదు. అయినా సెక్రటరీ ఎలా అయ్యారో ఎవరికి తెలియదు.  ఈ విషయాన్ని కేటీఆర్ కూడా పలుసార్లు ప్రస్తావించారు. రాజ్నాథ్ కుమారుడు ఎమ్మెల్యేగా, యడియూరప్ప కుమారుడు ఎంపీగా, వసుంధర రాజే కొడుకు ఎంపీగా ఇలా చాలా కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నాయి.


సినిమా పరిశ్రమలో కూడా కుటుంబాల ఆధారంగానే అభిమానులున్నారు. అయితే ప్రస్తుత కుటుంబ రాజకీయాలు అనే అంశం ప్రజలు సీరియస్గా తీసుకుంటారా లేదా అనేదే ప్రశ్నార్థకం. ఉదాహరణకు చూసుకుంటే తమిళనాడులో స్టాలిన్ కుటుంబం, కర్ణాటకలో దేవగౌడ, ఏపీలో వైఎస్ ఆర్, చంద్రబాబు, ఉత్తర్ ప్రదేశ్ లో ములాయం సింగ్ ఇలా పలు చోట్ల కుటుంబ పార్టీలే రాజకీయాలను నడిపిస్తున్నాయి.  వీరిని వారసులుగా ప్రజలు అంగీకరించి ఓట్లు వేసి గెలిపిస్తున్నారు.  ఎన్ని విమర్శలు చేసిన తుది నిర్ణయం ఓటరుదే. ప్రజా కోర్టులోనే ఈ విషయం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: