బీజేపీకి మెడకు చుట్టుకుంటున్న బాబు కేసులు?
ప్రస్తుతం తనపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు శుక్రవారం వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ కేసు విషయంలో బీజేపీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.
ఒకవేళ చంద్రబాబు ఈ కేసులో బయటకి వస్తే నారా లోకేశ్ అమిత్ షా ను కలవడం వల్లే ఆయనే బయటకు వచ్చారు అని వైసీపీ నేతలు చెబుతూ ప్రచారం చేసుకుంటారు. ఇప్పటికే పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయన బయటకి వస్తే ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది.
ఒకవేళ ఆయన లోపలే ఉంటే బీజేపీ నేతలే ఇదంతా కావాలని చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందని అందుకు ఈ విషయంలో ఆ పార్టీ అధిష్ఠానం స్పందించడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు గమనిస్తే బీజేపీ హస్తం ఉంటే ఈ పాటికే ఈడీ, ఇన్కం ట్యాక్స్ వాళ్లు రంగ ప్రవేశం చేసేవారు. బెయిల్ కూడా రాదు. నెలల తరబడి జైలులోనే ఉంటారు. మరోవైపు మేమే చేశాం అని వైసీపీ గొప్పలు చెప్పుకుంటుంది.
అసలు ప్రాతినిధ్యం లేని ఏపీలో అరెస్టు వెనుక ఉంది మేమే అని చెబితే బీజేపీకే మైలేజ్ వస్తోంది. కానీ ఇదంతా కేంద్రానికి తెలియకుండా జరుగుతుందా అంటే కచ్చితంగా తెలుసు. అందుకే చంద్రబాబుకి ముందస్తు సమాచారం ఇచ్చారు. లేకపోతే బహిరంగంగా చంద్రబాబు తనను అరెస్టు చేస్తారని ఎలా చెబుతారు.