జగన్.. ఆ మీడియా లెక్కలు కూడా బయటపెట్టు?

అధికార పక్షం విపక్షం పైనా , విపక్షాలు అధికార పక్షం పైన విమర్శలు చేసుకోవడం ఏ రాష్ట్రంలోనైనా సర్వ సహజం. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికార పక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ఒక విషయాన్ని టార్గెట్ చేశారని తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలు ప్రభుత్వ ఉద్యోగులందరికీ సాక్షి పేపర్ ని కొనుగోలు చేసేలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు టిడిపి వాళ్ళు ‌.


అది కూడా ప్రభుత్వ సొమ్ముతోనే కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. సచివాలయంలోని ఉద్యోగులు, వాలంటీర్లు అందరి చేత సాక్షి పేపర్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వాళ్లు. అయితే దీనికి బదులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా కళ్ళు తెరిచి మాట్లాడాల్సి ఉందని అంటున్నారు కొంతమంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈనాడో, ఆంధ్రజ్యోతో కంపల్సరీ చేయడం జరిగిందనే విమర్శలు ఉన్నాయి.


మరి అలాంటి వాళ్ళు, అప్పుడు ఆ విధంగా చేసిన వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇలా విమర్శలు చేయడం ఏంటని అంటున్నారు కొంత మంది. అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్ రూపంలో, అలాగే సపోర్టు రూపంలో సాక్షి పేపర్ కు డబ్బులు దోచి పెడుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు. అలా అన్న వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడుకు సంబంధించిన లైవ్ అనగా ప్రత్యక్ష ప్రసారాలను  ఏ టెండర్లు పిలిచి జరిపించారని అడగాల్సి ఉంది వీళ్లు.


అప్పట్లో ఆంధ్రజ్యోతి అలాగే దాని అనుబంధ సంస్థలు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన లైవ్ లను ప్రసారం చేసేవి. ఒక్కొక్క లైవ్ కి ఎంత ఇవ్వాల్సిన దానికి ఎంత ఇచ్చారు. ఇలా ఏడాదికి ఎన్ని కోట్లు ఇచ్చారు అనేది కూడా అడగాల్సి ఉంది. కానీ ఏ కారణం మీద వీళ్లు ఇదంతా అడగడం లేదనేది తెలియడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: