విచిత్రం: తల్లితో కడుపులో బిడ్డ న్యాయ పోరాటం?

మన దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. కానీ సర్వోన్నత న్యాయస్థానం మెట్లు అందరూ ఎక్కలేరు. దీనికి కొంత ఆర్థిక స్తోమత కలిగి ఉండాలి. ఇటీవల ఓ మహిళ గర్భవిచ్ఛిత్తికి అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టున ఆశ్రయించింది.  నాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. మరో బిడ్డను కంటే పెంచే పోషించే ఆర్థిక పరిస్థితి నాకు లేదు. దీనిపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పునిచ్చింది.


ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ప్రసవాల తర్వాత నుంచి తాను కుంగుబాటుతో ఇబ్బందులు పడుతున్నానని కోర్టుకు తెలిపారు. మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె న్యాయస్థానానికి వివరించారు. దీనిపై మొదట విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం గర్భవిచ్ఛితి చేసుకునేందుకు ఆమెకు అనుమతి ఇచ్చింది. ఆ ఉత్వర్వులను రీకాల్ చేయాలని అభ్యర్థిస్తూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. పిండి బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికను  ప్రస్తావించింది.


దీనిపై ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పునిచ్చింది. ఒకరు అబార్షన్ కు విముఖత తెలుపగా.. మరొకరు సమర్థించారు. దీంతో ఈ పిటిషన్ సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది.  ఈ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లి హక్కుతో పాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పిండం సజీవంగా ఉంది. బతికే అవకాశాలున్నాయి. ఆ గుండె చప్పుడు ఆపాలని మేమే ఆపమని మేమే ఎయిమ్స్ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా.. మేం ఆ బిడ్డను చంపలేం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


ఈ పిండాన్ని 26 వారాలు మోసారు. ఇంకొన్ని వారాలు ఎదురుచూడండి ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడింది. ఆ బిడ్డను మోసే బాధ్యత గురించి కేంద్రం ఆ మహిళతో మాట్లాడాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

law

సంబంధిత వార్తలు: