షర్మిళ సంచలన నిర్ణయం.. ఎవరికి లాభం?

వైఎస్ షర్మిళ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కలుస్తారని అనుకున్న సమయంలో చివరకు ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం ప్రకటించి తెలంగాణలో సరికొత్త మార్పుకు సంకేతం ఇచ్చారు. అయితే తెలంగాణలో సీఎం కేసీఆర్ ను నిలదీసిన పార్టీ అంటే వైఎస్సార్ టీపీ అనే చెప్పొచ్చు. అంతలా ప్రజల్లోకి దూసుకెళ్లిపోయారు. కానీ ఆమెను కాంగ్రెస్ ట్రాప్ లోకి లాగింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత కాంగ్రెస్ కు తెలంగాణలో కూడా ఊపు వచ్చింది.


ఆ సందర్భంలో కర్ణాటకలో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి.కె శివకుమార్ కలిసిన తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేస్తారని లేదా పొత్తు పెట్టుకుంటారనే ఊహగానాలు వచ్చాయి. తదనంతరం ఆమె ఏకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కూడా కలవడంతో వైఎస్సార్ టీపీ పార్టీ విలీనం జరిగిపోయినట్లు వార్తలు వినిపించాయి. వీటన్నింటికి కూడా షర్మిల నోరు విప్పలేదు. రాబోయే రోజుల్లో చూడాలని సంకేతం ఇచ్చింది.


అయితే కాంగ్రెస్ పార్టీలో ఆమెకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని పుకార్లు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ లో చేరితే ఆమెతో పాటు తన అనుచరులు దాదాపు 10 మందికి పైగా టికెట్లు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే ఆమె కాంగ్రెస్ లో కి రావడం స్థానిక కాంగ్రెస్ నాయకులను ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి వర్గం.. విహెచ్ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.


దీంతో కాంగ్రెస్ ఆమె చేరిక ఆలస్యం కావడం కేవలం ఆమెకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంపీ సీటు ఇస్తామని చెప్పడం. మిగతా ఎవ్వరికీ సీట్లు ఇవ్వమని చెప్పడంతో ఇది కుదిరేలా లేదని అనుకుని నేరుగా తెలంగాణలో 119 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు. పాలేరులో షర్మిళ పోటీ చేస్తానని ప్రకటించింది. అదే సమయంలో బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ విజయమ్మ కూడా పోటీలో ఉంటారని ఆమె ప్రకటించారు. రాబోయే రోజుల్లో వైఎస్సాఆర్ టీపీ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: