ఇజ్రాయెల్‌ Vs హమాస్‌.. మూడో ప్రపంచ యుద్ధమేనా?

ఇజ్రాయెల్, హమాస్ దాడులు ఎటు వెళ్తాయో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఇజ్రాయెల్  పొరుగున ఉన్న సిరియా, హిజ్బుల్లాలతో ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది.  మరోవైపు అమెరికా, బ్రిటన్, భారత్ లాంటి దేశాలు ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తుంటే మరోవైపు పాలస్తీనాకు ఇరాక్ వంటి దేశాల అండ ఉంది.  ఇప్పుడు ప్రపంచమే ఇజ్రాయెల్ దెబ్బకి రెండు ముక్కలు అవుతుందా.. అనే సందేహం తలెత్తుతోంది.

రష్యాతో యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్ కు ఆయుధ సరఫరా చేసి నాటో దేశాలు విసిగిపోయాయి.  ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. దీనికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఆయుధ సరఫరాను తగ్గిస్తూ వస్తున్నాయి. కానీ అమెరికా నుంచి నాటో దేశాలకు ఒత్తిడి వస్తోంది. మీ దగ్గర ఉన్న పాత ఆయుధాలను వదిలించుకోండి అవసరమైతే కొత్త ఆయుధాలను మేమిస్తాం అని చెబుతోంది. ఇజ్రాయెల్ ఉక్రెయిన్ కు సహకారం అందిస్తే అది రష్యాను దీటుగా ఎదుర్కొంటుందని పెంటగాన్ వ్యూహం.

ఇజ్రాయెల్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభం నుంచి తటస్థంగా ఉంటూ వస్తోంది. మూడు నెలల క్రితం జెలన్ స్కీ ఇజ్రాయెల్ కు మానవత్వం అంటే ఏంటో తెలియదు అని ఘాటుగానే వ్యాఖ్యానించారు. దీనికి నెతన్యాహూ బదులిస్తూ ముందు మీ ఇంటిని చక్కబెట్టుకో మాకు నీతులు చెప్తే తగిన గుణపాఠం చెబుతానని తీవ్రంగా హెచ్చరించారు.

ఇజ్రాయెల్ కు రష్యాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు. అందుకే భారత్ లా తటస్థంగా ఉంటుంది. ఈ నెలలో ఇజ్రాయెల్ తో సౌదీ వాణిజ్య వ్యవసాయ రంగాల్లో పరస్పర ఒప్పందం చేసుకోబోతున్న తరుణంలో హమాస్ దాడి చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాలోని మసీదులను కూల్చివేసింది. ఇది సౌదీకి నచ్చకపోతే ఒప్పందం రద్దవుతోంది. పుతిన్ కి, ఇరాన్ కి కావాల్సింది కూడా అదే. ఏ దేశ ప్రయోజనాల కోసం ఇదంతా జరుగుతోంది అనేది ఎప్పటికి అర్థం కాదు. ఇప్పుడు అగ్రరాజ్యాలుగా పిలవబడుతున్న దేశాలన్నీ ప్రధాని మోదీ వద్దకు వచ్చి తమ పంచయితీలు పరిష్కరించమని కోరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: