ఇజ్రాయెల్‌ పోరాటం.. భారత్‌కు గుణపాఠం?

వలసలు చుట్టుముట్టేస్తున్నాయి. వలసల  ఫలితంగా చాలా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు కూలుతున్నాయి. అల్లర్లు, నేరాలు, ఘోరాలు, అశాంతి ఆ దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. వీటికి పరిష్కారం లభించకపోగా.. మరింత రగిలే ప్రమాద ఘంటికలే వినిపిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారితో పాటు సక్రమంగా వచ్చిన వారితోను సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి భారతదేశం మినహాయింపు ఏం కాదు.


విదేశాల నుంచి వలస వచ్చిన వలసదారులను శరణార్థులుగా కాకుండా మనలో కలిపేసుకుంటే వచ్చే సమస్యే ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ దాడులు.  దీనిని ప్రతి భారతీయుడు గుర్తు పెట్టుకోవాలంటున్నారు హిందుత్వ వాదులు. ఇజ్రాయెల్ లో నెతన్యాహూ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వచ్చిన బెన్నెట్ ప్రభుత్వం పాలస్తీనా కు సంబంధించిన వాళ్లను ఆయా దేశాల్లో ఉండటానికి అవకాశం కల్పించింది. మన దగ్గర కూడా పశ్చిమ బెంగాల్, కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో ఇతర దేశ శరణార్థులకు మన వాళ్లు ఆశ్రయం కల్పించారు. దీంతో వాళ్లు మనల్నే దెబ్బతీశారు. షాహిద్బాగ్ లాంటి ఘటనలే దీనికి ఉదాహరణ. మన దగ్గరే ఉంటూ.. మన దేశాన్ని కూడా మత రాజ్యంగా స్థాపించాలనేదే వాళ్ల లక్ష్యమన్నది హిందూత్వ వాదుల వాదన.


ఇప్పుడు ఇజ్రాయెల్ లో జరుగుతుంది అదే. అదే సందర్భంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం మనల్ని దెబ్బకొట్టాలనుకునే శత్రువు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. మనల్ని కాపాడేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు 100మంది విదేశీయుల్ని కిడ్నాప్ చేశారు. తద్వారా ఆయా దేశాలను బెదిరిస్తారు, ఒత్తిడి తెస్తారు.  ఇది వాళ్లు వేసే ఎత్తుగడ.


భిన్న సంస్కృతులకు నిలయమైన భారత్ కూడా వలసల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మిగిలిన దేశాల నుంచి అక్రమంగా చొరబడే వారిపై జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల వలసలపై దృష్టి సారించాలి. అంతర్గత సమస్యలను అరికట్టడంతో పాటు, మతోన్మాద ఉగ్రవాదం ప్రబలకుండా చూడాలి. కాబట్టి ప్రతి అంశం కీలకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: