మోదీ.. జగన్.. ఒకటే మాట.. ఒకటే బాట?
భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు తానే దేశ సేవకుడినని పలు సభల్లో ప్రకటిస్తుంటారు. నేను మీ సేవకుడిని. మీ కోసం పనిచేసేందుకు వచ్చాను అని చెబుతుంటారు. నేను కానీ, నేను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, అమలు చేస్తున్న విధాన పర నిర్ణయాలు నచ్చితే నాకు ఓటేయండి అని ప్రజలకు కోరుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇదే విధానాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి సైతం పాటిస్తున్నారు. నా వల్ల మీ కుటంబం లబ్ధి పొందితే నన్ను మరో సారి గెలిపించండి అని పేర్కొంటున్నారు.
సైద్ధాంతికంగా బీజేపీ, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేరువేరు. వైసీపీ మైనార్టీలను బుజ్జగించే పార్టీ అయితే బీజేపీ మెజార్టీలకు సంబంధించిన పార్టీ. కానీ ఆలోచన విధానాల్లో మోదీ, జగన్ లు ఒకేలా ఆలోచిస్తున్నారు. ఇద్దరూ తాము అనుకున్న పనిలో తెగించే ధైర్యంగా ముందుకు వెళ్తుంటారు. వారు అనుకున్న విషయంలో రాజీ పడరు.
నాటీ యూపీఏ కూటమిని మారిస్తూ దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ముందస్తుకు వెళ్తారనే ప్రచారం జరిగినా వాటన్నింటిని కొట్టి పారేస్తూ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఏపీలో కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్నారు. ఎన్నికలకు అందరం కలిసే ఎన్నికలకు వెళ్తాం అని ప్రకటించినా వారికి సరైన ప్రణాళిక లేదు. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే వైసీపీ లాభం చేకూరేదే. కానీ కేంద్రంతో కలిసే ఎన్నికలకు వెళ్తానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.