పవన్‌.. ఎన్డీఏ.. దాగుడుమూతలు?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. ఇప్పటి వరకు తిట్టుకున్న నేతలే మరుక్షణం పార్టీ మారుతూ ఉంటారు. అప్పటి వరకు ఒకరిని ఒకరు విమర్శించుకునే పార్టీలే పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తుంటాయి. అయితే అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు కోసం ఇతర రాజకీయ పార్టీలు వెంపర్లాడటం సహజం. ఆ పార్టీకి ఏమైనా అవసరాలు వస్తే అధికార పార్టీ చూసుకుంటుంది కాబట్టి.


ఉమ్మడి ఏపీ విషయానికొస్తే ఎన్డీయే కూటమిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పార్టీ లేదు ఒక్క జనసేన తప్ప. ఇది పవన్ కల్యాణ్ కు అరుదైన అవకాశమనే చెప్పవచ్చు.  గతంలో ఎన్డీయే కూటమి భాగస్వామ్యాల సమావేశం నిర్వహించారు. దీనికి పవన్ కు ఆహ్వానం అందింది. చంద్రబాబు వస్తానని సంకేతాలు ఇచ్చినా పిలవలేదు.  కానీ ఈ సదావకాశాన్ని టీడీపీ కోసం పవన్ త్యాగం చేశారా అనే సందేహాలు ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


పవన్ కల్యాణ్ ఏపీలో టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తాం అని ప్రకటించారు.  ఇందులో బీజేపీ ఉంటుందా లేదా అనే విషయమై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ చేస్తున్న వారాహి యాత్ర కు టీడీపీ అభిమానులు కూడా వస్తున్నారు.  కృష్ణా జిల్లాలో జరుగుతున్న వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ.. టీడీపీ బలహీన పరిస్థితుల్లోఉంది. మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఇది ఏపీ భవిష్యత్తుకు అవసరం.. మీకు జనసేన యువ రక్తం తోడైతే జగన్ మోహన్ రెడ్డిని ఓడించవచ్చు. టీడీపీ అనుభవం.. జనసేన పోరాటం తో పాటు కలిసి వస్తే ఇతర పార్టీలతో కలిసి జగన్ ను అథఃపాతాళానికి తొక్కేయొచ్చు అని వ్యాఖ్యానించారు.


ఇదే సందర్భంలో మరో మాట కూడా  అన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి టీడీపీతో కలిశామని తెలిపారు. ఆ తర్వాత మరోసారి ఎన్డీయే నుంచి బయటకు వస్తే చెప్పే బయటకు వస్తా అంటూ  నాలికమడతేశారు. మొత్తానికి ఎన్డీఏలో చేరాలని వైసీపీ, టీడీపీ ఉవ్విళూరుతుంటే జనసేన మాత్రం బయటకు వస్తా అంటోంది. చూద్దాం పవన్ కు ఇది లాభమా నష్టమా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: