బాబు అరెస్టు.. ఏపీ మీడియా రెండు నాల్కలు?
అయినా కూడా జగన్ సర్కార్ మీడియాపై కక్ష సాధింపు చర్యలు ఏమీ తీసుకోవడం లేదు. ముఖ్యంగా ప్రజలకు అర్థమైతే చాలు అనే విధానంలో ఆయన ఉంటున్నట్లు తెలుస్తోంది. కానీ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే అవి తెలంగాణకు సరిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రతిరోజు ఎన్నో రకాలుగా వైసీపీ సర్కారుపై విషం చిమ్మి వార్తలు రాస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. అయినా ఆయన పట్టించుకోకుండా ప్రభుత్వం పనితీరు అభివృద్ధి పై దృష్టి సారిస్తున్నారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే గగ్గోలు పెడుతున్న ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 తదితర మీడియా సంస్థలు గతంలో జగన్ అరెస్ట్ అయిన సమయం లో అక్రమాస్తుల కేసు అని వార్తలు రాసేవారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్టు అక్రమమని రాస్తున్నారు.
ఒక కోర్టు తీర్పు వచ్చి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి గురించి కాకుండా జడ్జి పైన కూడా కొంతమంది చేత విమర్శలు చేయిస్తున్నారు. అంటే వ్యవస్థపై దాడి చేస్తున్నారు. అరెస్టు విషయంలో విమర్శలు చేయడం తప్పు కాదు. కానీ ఆ విమర్శల్లో అర్థం ఉండాలి.కేసు గురించి మాట్లాడాలి. కేసులో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఎక్కడా తప్పు జరిగింది. ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందా చేయడానికి గల కారణాలు ఏంటి అని చెబుతూ ఉండాలి. కానీ మీడియా నోరు నొక్కేస్తున్నారని చెప్పడం వల్ల ఎలాంటి లాభం లేదు.