ఇంతకీ చంద్రబాబు ఆ తప్పు చేశారా.. లేదా..?

ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం చంద్రబాబు కు లేదని.. తానే ఓ సంస్థను నడుపుతున్నారని ఇటీవల నారా భువనేశ్వరి అన్నారు. ఆ సంస్థలో రెండు శాతం వాటా అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయని తెలపారు. అంతేకాకుండా ఆయన తప్పు చేయరనే విషయం అధికారులకు కూడా తెలుసని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ని అక్రమంగా జైల్లో పెట్టారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తప్పు చేయరని టీడీపీ నేతలు భావించవచ్చు కానీ ప్రజలు అనుకోరు. మిగతా పార్టీల నేతలు ఆయన అవినీతి చేస్తారు కానీ చట్టబద్ధంగా చేస్తారు. దొరికేలా చేయరు అని భావిస్తుంటారు. అసలు ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టడం ప్రారంభించిందే చంద్రబాబు అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటారు. ఆయనకు వ్యవస్థల్లో ఉన్న పలుకుబడితో చాలా తెలివిగా తప్పించుకుంటారు అనేది వారి వాదన.

పన్ను చెల్లింపుల శాఖలతో పాటు ఇతర వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉంటారు. వాళ్లే ప్రత్యర్థి పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టడంలోను.. ఆయన్ను రక్షించడంలో వీళ్లే కీలకపాత్ర పోషిస్తుంటారు అని ప్రజలు నమ్ముతుంటారు. కానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అంటే నమ్మే స్థితిలో జనం లేరు. కానీ మహిళగా భువనేశ్వరి తో సానుభూతి రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయినప్పుడు ఇదే తరహాలో వైఎస్ విజయమ్మ వచ్చి నా కుమారుడు ఏ తప్పు చేయలేదు. నిరపరాధి.. వాళ్ల నాన్నే సీఎం అలాంటిది అవినీతి చేయాల్సిన అవసరం ఏముంది  అని వ్యాఖ్యానించారు.  దీనిపై టీడీపీ నేతలు ఇచ్చే కౌంటర్లను ఎల్లో మీడియాలో ప్రముఖంగా ప్రచురించేవారు. ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియాలో కూడా ఇదే తరహా వార్తలను రాస్తున్నారు. పత్రికలు ఎవరి రూట్లలో వారు నడుస్తున్నారు కాబట్టి మీడియాను, ఉపన్యాసాలను చూసి జనం ఓ అభిప్రాయానికి రావడం ఎప్పుడో మానేశారు. చంద్రబాబుని ఈ వయసులో అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నారని భావిస్తున్నారు తప్ప అవినీతి చేయలేదంటే మాత్రం నమ్మే స్థితిలో వారు లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: