బాబు అరెస్టు.. కేటీఆర్‌ తొందరపడ్డరా?

చంద్రబాబు ఒక బ్రహ్మ పదార్థం. ఆయనకు ఇతర రాష్ట్రాల్లో కొంత సానుభూతి ఉంటుంది. అభిమానించే వారు ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో సహజంగా చంద్రబాబు అభిమానులు భారీ సంఖ్యలోనే ఉంటారు. దీనిని అవకాశంగా మలచుకునేందుకు చంద్రబాబు అరెస్టు విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఖండించారు. కాంగ్రెస్ విషయానికొస్తే వీహెచ్, రేణుకా చౌదరి, ఇంకొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులు స్పందించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడైనా అరెస్టయిన వెంటనే స్పందించలేదు.

చంద్రబాబు ముద్ర తనపై పడకుండా రేవంత్ జాగ్రత్త వహించారు. ఓ వైపు టీ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తుంటే ఏపీలో మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో టీడీపీ నేతలు బీజేపీది డబుల్ గేమ్ అంటూ ఆరోపిస్తున్నారు. తెలంగాణ లో మమ్మల్ని(టీడీపీ) ఉద్యమాలు చేయనివ్వరా మీరు అంటూ బీఆర్ఎస్ ను ను ప్రశ్నించారు.


తెలంగాణలో చంద్రబాబు ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదంటూ ఐటీ నిపుణులు ప్రదర్శన గా రాజమండ్రి జైలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తమపై వ్యతిరేకత రాకుండా ఈ సందర్భంలో బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి లు బాబు అరెస్టును ఖండించారు.
దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ చంద్రబాబు అరెస్టుతో ఈ రాష్ట్రానికి ఏం పని. ఇక్కడి ఉద్యోగులు ఎందుకు నిరసనలు వ్యక్తం చేయాలి. ఈ అంశాన్ని ఏపీలోని రెండు పార్టీలు చూసుకోవాలి. స్వయంగా లోకేశ్ నన్ను అడిగినా కుదరదు అని తేల్చి చెప్పాను అని వ్యాఖ్యానించారు.


ఇప్పటివరకు రేవంత్‌ రెడ్డి చంద్రబాబు శిష్యుడైనా టీడీపీ మద్దతుదారులు దాదాపు 60-70 శాతం మంది బీఆర్ఎస్ కు ఓటేస్తూ వచ్చారు. ఇప్పుడు కేటీఆర్ వ్యవహరించిన తీరు చూస్తుంటే టీడీపీ ఓటర్లను బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గం కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ నష్టాన్ని వైసీపీతో పూడ్చాలని చూస్తున్నారా అనేది ఎవరికీ తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: