తెలుగుదేశానికి పవన్ షాక్‌ ఇవ్వబోతున్నారా?

2009 నుంచి 2019 వరకు జనసేన పార్టీ వివిధ రకాలుగా పోటీ చేసింది. కొన్ని సార్లు పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో కేవలం రాష్ట్రంలో ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2009 నుంచి ఎదురుచూస్తున్న కోరిక 2024 లో సాధించబోతున్నాం. నన్ను నమ్మండి అని పవన్ కల్యాణ్ తాజాగా ఒక సభలో అన్నారు. ఇవి చాలా కీలకమైన వ్యాఖ్యలు అని తెలుస్తుంది. 2009 తర్వాత కాపులకు అధికారం కావాలి. కమ్మ, రెడ్లు కాకుండా కాపులు అధికారంలో ఉండాలని పవన్ కల్యాణ్ భావించారు.


2014 లో బీజేపీకి టీడీపీ కి మద్దతు ఇచ్చి పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయారు. కానీ 2019 వచ్చే సరికి పోటీ చేశారు. కానీ కేవలం ఆరు శాతం ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ రాజమండ్రి లోని జైలులో చంద్రబాబును కలిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే పక్కా ప్లాన్ తోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఈ సారి ఎలాగైన సరే అధికారంలోకి రావాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం పవన్ కల్యాణ్ కు సరైన దిశా నిర్దేశం చేశారని ఎలాగైనా సరే జగన్ ను ఓడించి చంద్రబాబుతో పాటు పవన్ అధికారాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ముఖ్యంగా 2009 నుంచి అనుకుంటున్నది 2024 లో నిజం కాబోతుంది అంటే ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబుతో షేర్ చేసుకుంటారా? లేక జనసేనకు టీడీపీ ఎలాంటి ఆఫర్ ఇచ్చింది. ఏం జరగబోతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక చంద్రబాబు ఉన్నారా? లేక పవన్ కల్యాణ్ టీడీపీ ఓట్లు క్రాస్ కాకుండా జనసేనకు పడేందుకు ఏమైనా ఎత్తుగడలు వేస్తున్నాారా? దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ అడుగుతున్నా.. కేవలం పొత్తు పెట్టుకుని మాత్రమే పోటీ చేస్తామనడం వెనక పవన్ కు ఉన్న వ్యుహాం ఏమిటనే చర్చ సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: