
కేసీఆర్ బాటలో బాబు: కుప్పంతో పాటు అక్కడ కూడా?
అయితే తాజాగా అక్కడ పరిస్థితి చూస్తే ఇప్పటి వరకు అక్కడ జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబుని దెబ్బ తీసుకుంటూ వచ్చారు పెద్దిరెడ్డి. అందుకనే చంద్రబాబు నాయుడు రెండు చోట్ల నుండి పోటీ చేయబోతున్నారు అని ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన వార్త ద్వారా తెలుస్తుందని అంటున్నారు. మరి ఎక్కడ నుండి చంద్రబాబు నాయుడు పోటీ చేయబోతున్నారు అనే విషయం ఇప్పుడు చర్చకు వస్తుంది.
తూర్పు గోదావరి జిల్లా నుండి గాని, పశ్చిమ గోదావరి జిల్లా గాని, కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట, పనిలో పనిగా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోట నుండి కూడా ఆయన పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. కృష్ణా జిల్లా అనే పేరు కూడా వినిపిస్తుంది. గన్నవరం నుండి గాని, విజయవాడ ఈస్ట్ నుండి గాని, పెనమలూరు నుండి గాని ఆయన పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.
తాజాగా కెసిఆర్ కూడా ఇలా రెండు స్థానాల్లో నుండి పోటీ చేయబోతున్నారు. అయితే ఆ రెండూ పక్కపక్క స్థానాలే అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక పక్కన కుప్పం నుండి పోటీ చేస్తూనే మరో పక్కన తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలలో ఏదో చోట నుండి పోటీ చేయబోతున్నారని అంటున్నారు. మోడీ కూడా ఇదే విధంగా వారణాసి నుండి పోటీ చేయడం ఆయనకి కలిసి రాబోయే అంశం అని తెలుస్తుంది.