ఉక్రెయిన్ దాడి.. ప్రపంచ అణు యుద్ధం తెస్తుందా?
అణ్వాయుధాలను ప్రస్తుతం పెద్ద ఎత్తున మోహరిస్తుంది. దీనికి కారణం దక్షిణ రష్యాలోని అణ్వాయుధాలు ఉన్న ప్రాంతాల్లో నాటో దేశాలు ఇచ్చిన మిస్సైల్స్ తో ఉక్రెయిన్ దాడికి తెగబడింది. ఇన్ని రోజులు ఏ అణ్వస్త్ర దాడి జరగకూడదని అనుకున్నారో అదే విధంగా జరిగే అవకాశానికి ఉక్రెయిన్ అగ్గి రాజేసింది. రష్యా కు ఎక్కడా లేని ఆగ్రహం తెప్పించింది. దీంతో రష్యా ఎప్ 16 ఫైటర్ జెట్స్ ఇవ్వడానికి అమెరికా, నాటో దేశాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి.
దీంతో రష్యా, స్పేస్ ఏజెన్సీ ప్రకారం.. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిఫణులు రంగంలోకి దించేందుకు రెడీ అయింది. ఎఫ్ 16 ఫైటర్ జెట్స్ తో గనక ఉక్రెయిన్ రష్యా పై దాడి చేస్తే ఇక రష్యా బాలిస్టిక్ క్షిపణి నుంచి ఏం ప్రయోగిస్తుందనేది ఇప్పుడు అసలైన చర్చ సాగుతోంది. బాలిస్టిక్ క్షిపణి అంటేనే అణ్వస్త్రాలను మోసుకెళ్లగల శక్తి ఉన్న మిస్సైల్స్. మరి వీటిని రంగంలోకి దించిందంటే ఏ క్షణాన్నైనా అణ్వస్త్ర దాడి జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇదే గనక జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం సహజం.
దీంతో రష్యా వద్ద ఉన్న అణ్వస్త్ర బాంబులతో ఏ దేశంపైనైనా విరుచుకుపడేందుకు అది సిద్దంగా ఉంటుంది. అమెరికా కూడా రష్యాను నాశనం చేయాలని అది కూడా అణ్వస్త్ర దాడికి దిగుతుంది. దీంతో ఇది ప్రపంచ యుద్ధంగా మారి మానవ వినాశానానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని శాంతి యుతంగా పరిష్కరించే మార్గాలను ఐక్యరాజ్య సమితి వెతకాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.