ఐటీ నోటీసులు: చంద్రబాబు ఇరుక్కుపోయినట్టేనా?
గతంలో చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటు కు నోటు కేసు విషయంలో ప్రధాన సూత్రదారుడని తేలిన సమయంలో కేసీఆర్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు ఏసీబీ, మీకు ఏసీబీ ఉంది. నేనొక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని మీరొక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. నన్ను మీరేం చేయలేరని అన్నారు. దీనికి బదులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రివర్స్ సమాధానం ఇచ్చారు. అప్పుడు నిన్ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు చంద్రబాబు అని అన్నారు.
అయితే అందరు ఇక చంద్రబాబు పని అయిపోయింది. జైలుకెళ్లడం ఖాయమని భావించారు. కానీ అసలు అప్పుడు వివాదం నెలకొన్న సమయంలో చంద్రబాబు అన్న మాటలే నిజమయ్యాయి. ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరని నిరూపించారు. ఆ కేసు విషయంలో మిగతా వారు ఇరుక్కున్నారు. కానీ చంద్రబాబును ఎవరూ కూడా ఇప్పటి దాకా టచ్ చేయలేకపోయారు. సీఎం కేసీఆర్ మాటలు వట్టివేనని తేలిపోయాయి.
ఇన్ కంట్యాక్స్ అధికారుల విషయంలో కూడా చంద్రబాబు ట్యాక్స్ కట్టడం లేదని పలానా విషయంలో ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి లేకపోవచ్చు. కానీ అధికారులు మాత్రం ఆయన అదుపులో ఉంటారని మాత్రం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ కం ట్యాక్స్ విషయంలో కేంద్రం వాళ్లు చెబితే మీరెందుకు చెబుతారని ఇక్కడి వాళ్లు అడిగితే నన్నే అడిగేంత వాళ్లు అయ్యారా మీరని భయపెట్టడం కూడా తెలిసిన వ్యక్తి అని అందరూ అనుకుంటున్నారు.