చంద్రబాబు ఓటమికి రెడీ అయిపోతున్నారా?
ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఢిల్లీ వెళ్లి ఎన్నికల ప్రధాన కమిషనర్ ను కలిసి ఏపీలో దాదాపు 15 లక్షల ఓట్లను వైసీపీ ప్రభుత్వం తొలిగించింది. వాటిని పునరుద్ధించాలని కోరారు. అయితే ఎల్లో మీడియా మాత్రం 60 లక్షల ఓట్లు అంటూ నానా యాగి చేశారు. చివరకు బాబు మాత్రం 15 లక్షల ఓట్లను తొలగించారని కంప్లైట్ ఇవ్వడంతో ఇప్పుడు ఏం రాయాలో తెలియక తికమక పడుతున్నారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా దాదాపు 5 లక్షల ఓట్లను తొలగించారని వైసీపీ ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేసింది. కానీ దానికి సంబంధించి 3 లక్షల ఓట్లని తర్వాత తేలింది. వాటిని ఎన్నికల కమిషన్ యధావిధిగా తీసుకొచ్చింది. అప్పుడు వైసీపీ అనుకూల ఓట్లను టీడీపీ తొలగించిందని ప్రధాన ఆరోపణ. సెమ్ సీన్ రిపీట్ అవుతోందని టీడీపీ తెగ గగ్గోలు పెడుతుంది.
టీడీపీ అనుకూల ఓట్లు ఇటు ఆంధ్రలో అటు హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నాయి. వారు అక్కడ ఇక్కడ ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ అలా రెండు చోట్ల ఓట్లు వేసే వారి ఓట్లను తొలగించాలని ఆదేశించారు. దీంతో చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల కమిషనర్ గడప తొక్కాల్సి వచ్చింది. మరి ఎన్నికల కమిషన్ ఎలక్షన్ల నాటికి తొలగించిన ఓట్లను తిరిగి ఇస్తుందో లేదో చూడాలి.