ఇండియా కూడా అమెరికాలా.. మోడీకి తిరుగుండదా?

సాధారణంగా  మన దేశంలో అధ్యక్షుడిని ఓటింగ్ ప్రక్రియ ద్వారానే ఎన్నుకుంటాం. ఎందుకంటే భారత్ దేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి. అయితే  అమెరికాలో ఈ అధ్యక్షుడిని ఎన్నుకునే విధానం  ప్రజాస్వామ్య విధానంలోనే ఉన్నా భిన్నంగా ఉంటుందట. అక్కడ అధ్యక్ష పదవికి అర్హులం అనుకున్న వాళ్లు ఒక స్టేజిపై నిలుచుని తాము ఆ పదవికి ఎందుకు అర్హులమో చెప్పి కన్విన్స్ చెయ్యగలిగితే అక్కడి ప్రజలు వాళ్లలో ఒకర్ని ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారట.


అయితే మన భారతదేశానికి వచ్చేసరికి ఇక్కడ ఏ కాంగ్రెస్ పార్టీనో లేదంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులో ఈ విధమైన ఓటింగ్ కి సమ్మతిస్తారా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ, శశి థరూర్, మల్లికార్జున్ కార్గే లాంటి వాళ్లు కూడా ఈ  ఓటింగ్ ని ఓకే చేస్తారా? అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన నరేంద్ర మోడీ, అమిత్ షా అలాగే నిర్మల సీతారామన్ ఈ పద్ధతిలో ఎన్నిక అవ్వడానికి ఒప్పుకుంటారా అంటే ఇక్కడ కష్టమే.


అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఈసారి భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోటీపడుతున్నారు అని తెలుస్తుంది. వాళ్లలో ఒకరు నిక్కీ హేలి కాగా  మరొకరు వివేక్ రామస్వామి అని తెలుస్తుంది. ఈ సందర్భంగా వీళ్ళ మధ్య జరిగిన తొలి బహిరంగ చర్చ మంచి వాడిగా, వేడిగా సాగింది.  ఒక నిర్దిష్ట సమయంలో అయితే వీళ్ళు ఒకరినొకరు వేలు పెట్టుకొని చూపించుకుంటూ పెద్దగా అరుచుకునే పరిస్థితికి వచ్చారట.


రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు ట్రంప్ సహా 8 మంది పోటీ పడుతున్నారని తెలుస్తుంది. అయితే ఈ 8 మందిలో ఆరుగురు ఈ చర్చలో పాల్గొన్నారు. దీనికి ట్రంప్ మాత్రం హాజరవ్వలేదని తెలుస్తుంది. ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులు అమెరికాలో ఒకే వేదికపై చర్చిలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అయితే వీళ్ళు ఒకరినొకరు పక్కవారి విధానాలు బాగాలేవని విమర్శించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: