చైనాకు తేల్చి చెప్పేసిన మోడీ సర్కార్ ?
భారత్, చైనాల మధ్య సమస్యలను సరిదిద్దుకునే విధంగా ఆయన చర్చించారని తెలుస్తుంది. వాస్తవాధీన రేఖను గౌరవించుకోవడం మంచిదని, సరిహద్దు ప్రాంతాల్లో సోదర భావంతో మెలుగుదాం అని మోడీ చెప్పారట. దక్షిణాఫ్రికా లోని జోహన్స్ బర్గ్ లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే చైనా ప్రధాని జింపింగ్ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారని తెలుస్తుంది.
ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్ర తెలియ జేశారు. సరిహద్దు ప్రాంతంలో సైనిక బలగాలను వెనక్కి మళ్లించేందుకు ఇరువురు దేశాలు ఒక ప్రతిపాదనకి వచ్చారని తెలుస్తుంది. జి20 సమావేశానికి జింపింగ్ మోడీని ఆహ్వానించారా అని అడిగితే దానికి వినయ్ క్వాత్ర సమాధానం ఇవ్వలేదు. బ్రిక్స్ సమావేశానికి వెళ్లేటప్పుడు మోడీ, జింపింగ్ ఇద్దరూ మాట్లాడుకున్నారట.
సంయుక్త విలేకరుల సమావేశం అనంతరం వాళ్ళిద్దరూ క్లుప్తంగా మాట్లాడుకున్నారట. కరచాలనం కూడా చేసుకున్నారట. దానికి సంబంధించిన వీడియోని దక్షిణాఫ్రికా అధికార వార్తా ఛానల్ ఎన్ ఏ బి సి ప్రసారం చేసింది. గతేడాది నవంబర్ లో జరిగిన జీ20 సమావేశం తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఇదే ప్రథమం. మోడీ అయితే సరిహద్దు రేఖ నుండి వెనక్కి వెళ్ళిపోమని చైనాకి చెబుతున్నారు. కానీ చైనా మాత్రం మేము ఆక్రమించుకున్న స్థలంలోనే మేము ఉంటాము, మీరే వెనక్కి వెళ్లిపోండి అని అంటుంది. కానీ మీరు వెనక్కి వెళ్తేనే మేము వెనక్కి వెళ్తామని చైనాకు తేల్చి చెప్పారు మోడీ.