జగనన్నా.. మమ్మల్ని కరుణ చూపవా?

ఇటీవల ఎన్జీవోలు మీటింగ్ లకు అటెండ్ అయిన సీఎం జగన్ వారికి కొన్ని హామీలు ఇచ్చారు. డీఏ ఇస్తామని కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని అన్నారు. ఇంత చేస్తున్న సీఎం జగన్ ఏపీ ప్రభుత్వ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న 800 మందిపై కూడా కరుణ చూపాలని కోరుతున్నారు. తమను కూడా పర్మినెంట్ చేయాలని వేడుకుంటున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. గంటకు నాలుగు వందల రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. నెలకు 72 గంటల పని చేయిస్తున్నారు.


నవంబర్ నుంచి నెలకు రూ. 28 వేలు చెల్లిస్తున్నారు. దాదాపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయించుకుంటున్నారు. ఇంటర్న్ షిప్ వర్క్, న్యాక్ వర్క్ ఆఫీసు వర్క్ ను కూడా గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లతోనే పని చేయిస్తున్నారు. రెగ్యులర్ వారిలాగా కాకుండా కేవలం 10 నెలలు జీతాలు మాత్రమే ఇస్తున్నారు. 12 నెలల జీతం ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. పని మొత్తం రెగ్యులర్ వారితో సమానంగా చేసినా అక్కడ ఏమీ జరగడం లేదు.


సమ్మర్ హాలిడేస్ లో జీతం ఇవ్వలేదు. జూన్, జులై లో కూడా జీతం ఇవ్వలేరు. ఆగస్టు నెల జీతం రావాలంటే కమిషనరేట్ నుంచి ప్రొసిడింగ్స్ రావాలి. కనీసం కాంట్రాక్టు పరిధిలో నైనా విలీనం చేయండని గతంలో సీఎం జగన్ ను వేడుకున్నారు. అయితే ఈ 800 మంది నేరుగా సీఎంను కలవాలనుకున్న వీరికి యాక్సెస్ లేదు. వీరు డైరెక్టుగా సీఎంను కలవడానికి వీలు లేదు. కాబట్టి వీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే సిబ్బంది సీఎం నోటీసుకు తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మరి సీఎం జగన్ దగ్గరికి గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ల విషయం వెళుతుందా? ఆయన ఎలా స్పందిస్తారనే విషయంలో గెస్ట్ ఫ్యాకల్టీలు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: