ఏంటీ దారుణం: ఆడపిల్లల అత్యాచారాలకు అంతే లేదా?

సమాజంలో ఆడపిల్లలకు రక్షణ రోజు, రోజుకి కరువు అవుతుంది. ప్రేమ పేరుతో  మృగాళ్లు ఆడపిల్లలని నమ్మించి మరీ  గొంతు కోస్తున్నారు. కొంత మంది ప్రేమ పేరుతో యువతులను తీసుకెళ్లి అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. మరి కొంత మంది కామాంధులు ఆడ వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు. ఈ విధంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు దినదిన గండంలా ఉంది ప్రస్తుత పరిస్థితి.


చదువులకనీ,  ఉద్యోగాలకనీ బయటకు వెళ్తున్న ఆడవారు వాళ్ళు పెద్ద వాళ్ళు అయినా, చిన్నవాళ్ళైనా ఇంటికి వచ్చేవరకు కూడా నమ్మకం లేని పరిస్థితి  ఉంది ఇప్పుడు. ఇలాంటివి సమాజంలో జరగకుండా ప్రభుత్వం ఇంకా  రక్షణ శాఖ   ఇద్దరూ చూసుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఒక అమ్మాయి తల్లిదండ్రులు  చనిపోయిన తమ కూతురికి న్యాయం చేయమని పోలీసులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్న విషాద పరిస్థితి గుంటూరు రూరల్ వెంగళాయ పాలెంలో నెలకొంది.


ప్రేమ పేరుతో తమ కుమార్తెను నమ్మించి ఆ తర్వాత  బంధించి సామూహిక అత్యాచారం చేశారని ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తమ కుమార్తె చనిపోయి పది నెలలు అయినా పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయి తల్లిదండ్రులు సోమవారం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధితో కలిసి గుంటూరు రూరల్  పోలీస్ కార్యాలయానికి వెళ్లారు.


అక్కడ జరిగిన స్పందన కార్యక్రమంలో ఏఎస్పి కి తమ బాధను వెల్లడించారు. దానికి స్పందించిన  ఏ ఎస్ పి విచారించి బాధితులకు న్యాయం చేయాలని తమ సిబ్బందికి సూచించారు. అమ్మాయి తల్లిదండ్రులు విలేకరులతో మాట్లాడుతూ తమ కుమార్తె తనకు అన్యాయం జరిగిందని అప్పటి మహిళా డిఎస్పిని  కాళ్లు పట్టుకొని మరీ వేడుకుందని అన్నారు. దానికి ఆమె డబ్బులు ఇస్తాం సర్దుకుపోండి అని అన్నారని, కానీ మేము న్యాయమే కావాలని కోరడంతో తమ కూతురును వేశ్య అని అన్నారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. ఇలాంటి పరిస్థితుల నుండి ఆడవారిని ప్రభుత్వమే రక్షించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: