ఆ వర్శిటీలపై విశాఖలో ఎల్లో మీడియా రచ్చ..?
విద్యా సంస్థల్లో ఎంతో అనుభవం ఉన్న విజయ్ సాయి రెడ్డి కుమార్తె యూనివర్సిటీ పెడతానంటే దానిపై ఎల్లో మీడియా పత్రికలు రచ్చ చేస్తున్నాయి అని తెలుస్తుంది. విశ్వ విద్యాలయం ఏర్పాటుకు వైసిపి వాళ్ళు కొండలను కబ్జా చేస్తున్నారని వ్రాసుకొస్తున్నాయి ఈ పత్రికలు. విశ్వవిద్యాలయం కోసం 100ఎకరాల వరకు భూమి కబ్జా జరుగుతుందని అంటున్నారు. అంటే ఇక్కడ గీతం వాళ్ళు విశ్వవిద్యాలయం పెట్టుకోవచ్చు. కానీ వైసీపీ వాళ్లు పెడతానంటే మాత్రం నానా రాద్ధాంతం చేస్తున్నారు కొంత మంది వ్యక్తులు.
అలాగే విజ్ఞాన్ వాళ్ళ విశ్వవిద్యాలయం కూడా ఇక్కడ ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా, ఇక్కడ ఎన్ని ఎకరాల్లోనైనా, ఏదైనా స్థాపించుకోవచ్చు. కానీ వైసీపీ వాళ్లు చేస్తానంటే మాత్రం కొండల్లో చీపు అండ్ బెస్ట్ గా కొట్టేస్తున్నారు అని వ్రాసేస్తుంటారు. వీళ్ళ పద్ధతికి ఒక బలమైన ఉదాహరణ ఏమిటంటే గతంలో ఎల్ జీ పాలిమర్స్ అనే ఒక సంస్థను విదేశీయులు ఇక్కడ పడితే పర్యావరణం సాకు చూపించి వాళ్ళని ఇక్కడి నుండి వెళ్ళిపోయే వరకు వ్రాసుకుంటూ వచ్చారు ఎల్లో మీడియా అని అంటున్నారు.
అప్పుడు కోర్టుల్లో ఈ సంస్థపై కేసులు వేసి మరీ ఈ సంస్థను ఇక్కడ నుండి బయటకు పంపించేశారు. అదే అమర్ రాజా కంపెనీ విషయానికొచ్చేసరికి కోర్టు చెప్పిన తీర్పును కూడా కొట్టి పడేసారు వీళ్ళు అని అంటున్నారు. సోదాలు చెయ్యమని కోర్టు చెప్పినా కూడా వీళ్ళు చేయనివ్వలేదు. పైగా వీళ్ళే ప్రభుత్వం పరిశ్రమలను ఎంకరేజ్ చేయడం లేదు అంటుంటారు.