బీజేపీతో పవన్ విడాకులు ఖాయమేనా?

పవన్ కల్యాణ్ ఇంకా అయోమయంలో ఉన్నారా అనే సందేహాలు నెలకొన్నాయి.  ఎందుకంటే పవన్ కు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు. బీజేపీని వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. అదే సమయంలో టీడీపీతో కూడా కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. సమస్య ఎక్కడంటే బీజేపీ, టీడీపీ గత ఎన్నికల సమయాని కంటే ముందే విడిపోయాయి. గతంలో లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బీజేపీని ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుందని మరీ చెప్పింది.


దీంతో బీజేపీ అధిష్టానానికి చంద్రబాబు నాయుడుపై విశ్వాసం కోల్పోయారు. అవసరమైతే సాయం కోరడం.. అవసరం తీరిన తర్వాత వదిలేయడం బట్టి ఆయనను బీజేపీ అధిష్టానం నమ్మే పరిస్థితిలో లేదు. తెలుగుదేశం దెబ్బతింటేనే బీజేపీ, జనసేన పెరుగుతుంది అని కమలనాథులు భావిస్తున్నారు. తెలుగు దేశంతో కలిసుండాలా.. లేక బీజేపీతో కలిసి వెళ్లాలా అనేది పవన్ డిసైడ్ చేసుకోవాలని చెబుతున్నారు.


ఆంధ్రలో ఒక సీనియర్ జర్నలిస్టు విశ్లేషణ ప్రకారం.. పవన్ కల్యాణ్ కు ఇద్దరు బాగా సలహాలు ఇస్తున్నారని తెలుస్తోంది.  ఒకరు రాధాకృష్ణ, మరొకరు లగడపాటి అని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పవన్ కు ఇచ్చిన సూచనల్లో బీజేపీని వదిలేయాలని ఆ పార్టీకి ఆంధ్రలో అంత పెద్ద పేరు ఏమీ లేదని అంటున్నారు. అదే సమయంలో టీడీపీతో జత కడితే జనసేనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా ఇస్తున్నారు.


అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. కేంద్ర ప్రభుత్వంతో చాలా విషయాల్లో మంచి సత్సంబంధాలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి మేలు జరగాలన్న, జగన్ ను కేసులతో ఇబ్బంది పెట్టాలన్నా కేంద్రంతో కలిసి ఉండాలి. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే ఇది సాధ్యమవుతుందని పవన్ భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పవన్ అనుకున్నది జరుగుతుందా? లేక బీజేపీ నుంచి పవన్ ను విడ దీస్తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: