మెట్రో రైళ్లు ఇండియా ముఖచిత్రం మార్చనున్నాయా?
అయితే మెట్రో వల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఏదైనా గమ్యస్థానం చేరాలంటే అనుకున్నదాని కంటే ముందే చేరొచ్చు. బస్సులు, ఆటోలు, బైక్ ల కంటే ముందే మెట్రో లో గమ్యం చేరొచ్చు. మరీ ముఖ్యంగా క్యాబ్, ఆటోలో కంటే తక్కువ ధరకే మెట్రో లో ఛార్జీలు ఉండటం కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే దేశంలో మెట్రో రైల్వే స్టేషన్ల నిర్మాణం రైళ్ల పెంపుదలను చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఇప్పటి వరకు భారత్ లో 846 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు నడుస్తోంది. ఇంకా 450 కిలోమీటర్ల వరకు మెట్రో నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆమోదించబడిన రైల్వే నెట్ వర్క్ 370 కిలోమీటర్లు. అతి పెద్ద నిర్ణయం భారత మెట్రో నెట్ వర్క్ అధికారులు తీసుకోబోతున్నారు. మెట్రో సామర్థ్యాన్ని దాదాపు 10 వేల కిలోమీటర్లకు పైగా పెంచేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.
అయితే కొత్తగా చేపట్టే ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు దేశ వ్యాప్తంగా ఎంతో మంది కి లాభం చేకూరనుంది. దీంతో ప్రపంచంలో మెట్రోను ఎక్కువగా ఉపయోగించే దేశం అమెరికాతో కూడా సరి సమానంగా పోటీ పడే స్థాయికి భారత్ చేరుకుంటుంది. అమెరికాను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రజలు మాత్రం మెట్రో సేవలపై చాలా ఆనందంగానే ఉన్నారు. ప్రయాణంలో ట్రాఫిక్ ఉండకపోవడం సమయానికి చేర్చడంతో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.