ఆ మూడు సర్వే రిపోర్టులపై చంద్రబాబు దృష్టి?
తెలుగుదేశం పార్టీ అందరికీ పాత వారికే ఇస్తుందా అంటే కాదనే తెలుస్తుంది. రాబిన్ శర్మ టీమ్ తోనే కాకుండాా మిగతా వారితో కూడా సర్వేలు చేయిస్తున్నారు. అటు లోకేశ్ కానీ, ఇటు చంద్రబాబు చేయించుకుంటున్నారు. 120 నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారు. కానీ వారితోో ఢీ అంటే అనడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. కార్యకర్తలను రక్షించే పరిస్థితులు లేవని తెలుస్తోంది. అయితే వారందరినీ విడిచిపెట్టడానికి బాబు లేరు. కానీ సీరియస్ గా పని చేయండని బాబు వారికి సూచించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఏ పోరాటం చేసిన అది ప్రజల్లోకి వెళ్లాలి. టీడీపీ అంటేనే ప్రజలు గుర్తించేలా చేయాలని ఆయన చెబుతున్నారు. కాబట్టి టీడీపీ లో టికెట్ ఆశించే వారు నామమాత్రంగా నియోజకవర్గాల్లో తిరిగితే సరిపోదని వైసీపీ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ఆయా ప్రాంతాల్లో ఎండగట్టాలని బాబు సూచిస్తున్నారు. అనుకూలమైన చానల్ ను మీడియాను నమ్ముకుని 2019 లో బోల్తా కొట్టిన విషయాన్నిఇంకా మరిచిపోలేదు. కాబట్టి కచ్చితంగా ఈ సారి ఎలాగైన టీడీపీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు రెండు మూడు సంస్థలతో సర్వే చేయించుకుంటున్నారు. కచ్చితంగా అధికారంలోకి రావాలని లేకపోతే టీడీపీ క్యాడర్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. మరి చంద్రబాబు పథకం ఫలించి అధికారంలోకి వస్తారా లేదా వేచి చూడాలి.