జగన్‌పై లేచిన నోరు, కేసీఆర్‌పై పెగలదేం పవన్‌?

రాజకీయాల్లో ఒక పార్టీకి సంబంధించిన వారిని మరొక పార్టీ వాళ్లు విమర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షంలో వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అధికార  పక్షంలో ఉన్న వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉంటారు. అలాగే పక్క పార్టీ వాళ్లు కూడా ఇలానే విమర్శిస్తూ ఉంటారు. అయితే ఈ విమర్శ అనేది సహేతుకంగా ఉండాలని కొంత మంది రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

అంతే గానీ ఏదో దురుద్దేశంతో, అసూయతో, ఈర్షతో విమర్శించే విధంగా ఉండకూడదు అని వాళ్ళు భావిస్తున్నారు. అంతే కాకుండా ఒక తప్పును ఒకళ్లు చేస్తే తప్పని, మరొకరు చేస్తే రైట్ అని కూడా మాట్లాడకూడదు. ఈ విధంగా మాట్లాడడం వల్ల ప్రజలలో తమ మాటల యొక్క బలం అనేది ఎక్కువ కాలం కొనసాగదు అని వాళ్ళు అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి భూములు అమ్మితే అది స్వార్థం కోసం, చంద్రబాబు నాయుడు అమ్మితే దేశ ప్రయోజనం కోసం అని అనకూడదు.

ఒక వేళ భూములు అమ్మడం తప్పు అని అనుకుంటే భూములు ఎవరు అమ్మినా తప్పే అని అనాలి. మేము అధికారంలోకి వస్తే భూములు  అమ్మము అని అయినా చెప్పాలి. అంతే గాని  తనతో కలిసి నడుద్దాం అనుకున్న వాళ్లు చేస్తే ఒప్పు అని పవన్  అనకూడదు. తెలుగు దేశం వాళ్లు చేస్తే తప్పు కాని విషయం, వేరే వాళ్ళు చేస్తే ఎలా తప్పు అవుతుంది అని కొంతమంది అడుగుతున్నారు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. జగన్ భూములు అమ్మేసుకుంటున్నాడని, దేవుడని ఓటు వేస్తే దెయ్యమై పీడిస్తున్నాడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేశారు. చంద్రబాబు నాయుడుని కూడా పవన్ కళ్యాణ్ ఇదివరకు ఎప్పుడూ ఇంత దుర్భాషలు ఆడలేదు కదా. మరి  జగన్ విషయంలోనే పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు అంటున్నారో  తెలియడం లేదు. అదేపని కేసీఆర్‌ చేస్తున్నా పవన్ మాత్రం నోరెత్తడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: