టీడీపీలో ఫుల్‌జోష్.. కానీ జగన్ లెక్కలు వేరే?
గతేడాది జరిగిన ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీకి 50 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం లెక్కేస్తే నలభై శాతం కంటే ఎక్కువ ఓట్ల వచ్చిన నియోజవకవర్గాలు తొమ్మిది మాత్రమే ఉన్నాయి. 30 నియోజకవర్గాల్లో టీడీపీకి 32 నుంచి 35 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. మరో వైపు 35 నియోజకవర్గాల్లో 35 శాతం నుంచి 40 శాతం వరకు ఓటింగ్ ఉంది. 35 నుంచి 40 శాతం ఉన్న చోట్ల ప్రాబ్లం లేదు.
అయితే ఈ 35 నుంచి 40 శాతం ఉన్న చోట్ల జనసేన, బీజేపీ కలిస్తే వైసీపీకి ఓటమి తప్పక పోవచ్చు. 35 శాతం లోపల ఉన్న చోట జనసేన, బీజేపీ కలిసిన పర్లేదు అన్న భావన వైసీపీలో ఉంది. ఎందుకంటే ఈ రెండు పార్టీల ఓటింగ్ శాతం కేవలం 10 నుంచి 12 శాతమేనని అని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.
అయితే టీడీపీకి నలభై శాతం కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాలు రేపల్లె, గన్నవరం, తాడికొండ, ఉరవకొండ, పరుచూరు, జగ్గయ్యపేట, చీరాల, అద్దంకి, కుప్పం లాంటి ప్రాంతాల్లో 40 శాతం కంటే ఎక్కువ ఓట్లు టీడీపీకి పడే అవకాశం ఉంది. దాదాపు ఆత్మకూరు నుంచి దర్శి వరకు దాదాపు 35 శాతం వరకు టీడీపీకి ఓట్ల శాతం ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఊపు వస్తుందో వారే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.