చంద్రబాబులో ఇంత ధైర్యం.. ఎందుకంటే?
ఆయన రాకముందు పోలీసులు రౌడీయిజం చేసే రాజకీయ నాయకులకు తాబేదారుల్లా పని చేసేవారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ రౌడీలు అలాగే ఫ్యాక్షనిస్టులపై ఉక్కు పాదం మోపారు. రౌడీ రాజకీయాలు చేసేవాళ్ళు తన పార్టీలో ఉన్నా కూడా ఎటువంటి సంశయం లేకుండా వాళ్లని ఎలిమినేట్ చేసేవారు. అప్పటివరకు పోలీసులను తమ కంట్రోల్లో పెట్టుకున్న రాజకీయ నాయకులకు అసలు పోలీస్ పవర్ అంటే ఎలా ఉంటుందో చవి చూసేలా చేయించారు ఆయన.
అలాగే రౌడీ రాజకీయాలు చేసే వాళ్ళ తాట తీసే విధంగా అధికారులకు పవర్స్ ఇచ్చారు ఆయన. స్టీఫెన్ రవీంద్ర లాంటి పోలీసుల సత్తా కూడా రౌడీలకు చూపించిన క్రెడిట్ అయినది. 1995లో ఆయన అధికారంలోకి రావడానికి ఇది కూడా ఒక కారణం అయ్యింది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ఈ రౌడీలకు ఫ్యాక్షనిస్టులకు వార్నింగ్స్ ఇస్తూ వస్తున్నారు. తద్వారా సీఎం సీటు షేరింగ్ ను కోరుకుంటున్నారు.
అయితే ఇది నచ్చని టిడిపి శ్రేణులు చంద్రబాబు ఏ రౌడీయిజన్ని అయితే కంట్రోల్ చేశారో అదే రౌడీయిజాన్ని మళ్లీ వీళ్ళు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎవరి చేతిలో అయితే రౌడీయిజం అనేది కంట్రోల్ లోకి వచ్చిందో అలాంటి చంద్రబాబు తిరిగి రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా పరిస్థితి మారిపోతుందని కొంతమంది రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇలాగైతే భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రం తిరిగి రౌడీయిజం పంజాలో చిక్కుకుంటుందని వాళ్లు భావిస్తున్నారు.